జాతీయ వార్తలు

వందశాతం ‘క్యాష్‌లెస్’ ఎలా సాధ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాద్రి/నాగపూర్, డిసెంబర్ 13: పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పేదలను డబ్బులేని వాళ్లుగా చేయడం ద్వారా ప్రధాని వారిపై యుద్ధం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించగా, మాజీ ఆర్థిక మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు పి చిదంబరం, నోట్ల రద్దు ఈ ఏడాది జరిగిన అతిపెద్ద కుంభకోణం అని అన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో బ్యాంకు ముందు క్యూలో నిలబడిన వారిని కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్న రాహుల్ గాంధీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంవల్ల నల్ల కుబేరులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి వీలు కలిగిందన్నారు. కొద్దిపాటి ధనవంతులకు మేలు చేయడానికి ప్రధాని నోట్ల రద్దు ద్వారా పేదల సొమ్మును బ్యాంక్‌ల్లో ఉండేలా చేశారన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల నిజాయితీపరులు వీధిన పడితే, ధనవంతులు, అవినీతిపరులు బ్యాంకులనుంచి దొడ్డిదారిన పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటున్నారని రాహుల్ అన్నారు. అంతేకాదు నోట్ల రద్దుపై ప్రధాని రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. మొదట నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు నల్లధనాన్ని వెలికి తీయడం కోసం, నకిలీ ధనాన్ని అరికట్టడానికి అని చెప్పారని, ఆ తర్వాత ఉగ్రవాదాన్ని అంతం చేయడానికని అన్నారని, ఇప్పుడేమో నగదురహిత లావాదేవీలకోసమని చెప్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశాన్ని క్యాష్‌లెస్ ఎకానమీ వైపు తీసుకెళ్తామని మోదీ అంటున్నారని, అయితే ఆయన చర్య కారణంగా ప్రజలు నిజంగానే క్యాష్‌లెస్‌గా మారిపోయారని రాహుల్ అన్నారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అర్థం లేని నిర్ణయమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. నాగపూర్‌లో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ, వందశాతం నగదు రహిత లావాదేవీలు జరిగే పరిస్థితి దేశంలో ఎక్కడుందని ప్రశ్నించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోను చిన్నపాటి లావాదేవీలు నగదుతోనే జరుగుతాయన్నారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలు నెలరోజులుగా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసిందన్నారు. నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం తమ పార్టీవాళ్లే అయిన యశ్వంత్‌సిన్హాలాంటి వాళ్లను సంప్రదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. టెర్రరిస్టుల వద్ద కూడా 2 వేల రూపాయల నోట్లు లభిస్తున్నాయన్నారు. పెద్దనోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం..ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో మంగళవారం బ్యాంకు వద్ద వేచి ఉన్నవారితో మాట్లాడతున్న రాహుల్