జాతీయ వార్తలు

అభిశంసనకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డిని అభిశంసించాలంటూ 61 మంది రాజ్యసభ సభ్యులు ప్రతిపాదించిన పిటిషన్‌ను రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ తిరస్కరించారు.
పిటిషన్‌పై సంతకాలు చేసిన 61 మందిలో 21 మంది రాజ్యసభ సభ్యులు మద్దతు ఉపసంహరించుకున్నారు. జస్టిస్ నాగార్జునరెడ్డి అభిశంసన తీర్మానంపై తాము పెట్టిన సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నామని 18మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జెడి(యు) సభ్యులు అధ్యక్షుడు అన్సారీకి లేఖలు రాశారు. ఈ లేఖల ఆధారంగా నాగార్జునరెడ్డిపై వచ్చిన అభిశంసన పిటిషన్‌ను అన్సారీ తోసిపుచ్చారు. అభిశంసన తీర్మానంపై చర్య తీసుకునేందుకు 50 మంది ఎంపీలు సంతకం చేయవలసి ఉంటుంది. నాగార్జునరెడ్డి అభిశంసన విషయంలో మొదట 61 మంది ఎంపీలు సంతకాలు చేసినా, ఆ తరువాత 21 మంది ఉపసంహరించుకున్నారు.
అభిశంసనకు అవసరమైనంతమంది మద్దతు లేకపోవడంతో అన్సారీ అభిశంసన పిటిషన్‌ను తిరస్కరించారు. న్యాయమూర్తి నాగార్జునరెడ్డి నిజాయతీపరుడని తెలిసిన తరువాత తమ సంతకాల లేఖలను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వీరంతా అన్సారీకి తెలిపారు. నాగార్జునరెడ్డిపై జూనియర్ సివిల్ న్యాయమూర్తి రామకృష్ణ చేసిన ఆరోపణలు సత్యదూరమని తమకు తెలిసిందని వారు లేఖల్లో వివరించారు. జస్టిస్ నాగార్జునరెడ్డి కడప జిల్లా రాయచోటిలోని తన సోదరుడు పవన్‌కుమార్‌రెడ్డి ఇంటికి తనను పిలిపించి మరణ వాంగ్మూలం నుండి పవన్‌కుమార్‌రెడ్డి పేరు తొలగించాలని డిమాండ్ చేయడంతోపాటు, తనపై చేయి చేసుకున్నారని రామకృష్ణ చేసిన ఆరోపణ సత్యదూరమని ఎంపీలు తమ లేఖల్లో పేర్కొన్నారు.
వాస్తవానికి 2013 ఫిబ్రవరి 13న రామకృష్ణ రాయచోటిలో లేనేలేడని అన్నారు. సెలవులో ఉన్న రామకృష్ణ చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం కొత్తకోటకు వెళ్లినట్లు తరువాత విచారణలో తేలిందని ఎంపీలు తమ లేఖల్లో పేర్కొన్నట్లు తెలిసింది. జస్టిస్ నాగార్జునరెడ్డి తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదనేది కూడా నిజం కాదంటూ, ఆయన 2009 ఆగస్టు 10న తన ఆస్తుల వివరాలు వెల్లడించారని పేర్కొన్నారు. జస్టిస్ నాగార్జునరెడ్డిపై రామకృష్ణ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఒక పిటిషన్ రాష్ట్ర హైకోర్టు పరిశీలనలో ఉన్నదని, కోర్టు పరిశీలనలో ఉన్న అంశం ఆధారంగా అభిశంసన తీర్మానం పెట్టేందుకు వీలులేదని ఎంపీలు అభిప్రాయపడ్డారు.