జాతీయ వార్తలు

రాజీనామా చేసేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పార్లమెంటులో నిత్యం జరుగుతున్న గొడవలు చూస్తుంటే బాధేస్తోందని, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలనిపిస్తోందని బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం అద్వానీ బాధతో తన సీట్లో అలాగే కూర్చుండి పోయారు. పక్కనే ఉన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జౌళి మంత్రి స్మృతి ఇరానీతో ఆయన తన ఆవేదనను పంచుకున్నారు. ‘మీరు ప్రతిపక్షంతో మాట్లాడి సభ జరిగే విధంగా ఎందుకు ప్రయత్నించకూడదు?’ అని రాజ్‌నాథ్‌ను అద్వానీ అడిగారు. మాజీ ప్రధాని వాజపేయి ఉండి ఉంటే సభలో ఇంత గందరగోళం నెలకొననిచ్చేవారుకాదు కదా అని అద్వానీ అన్నారు. వాజపేయి ప్రతిపక్షంతో మాట్లాడి సభ జరిగేలా చూసేవారంటూ ఆయన ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. వాజపేయి సభలో ఉండి ఉంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఇప్పుడు నెలకొంటున్న గొడవలు, గందరగోళానికి ఎంతో బాధపడి ఉండే వారన్నారు. శుక్రవారమైనా లోక్‌సభ సవ్యంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని హోమ్ మంత్రికి అద్వానీ సలహా ఇచ్చారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ఆఖరు రోజైనా లోక్‌సభ పని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అద్వానీ వ్యక్తం చేయటం గమనార్హం. ‘పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటులో చర్చ జరగవలసిన అవసరం ఎంతో ఉన్నది, చర్చ జరగకపోతే శీతాకాల సమావేశాలు కొట్టుకుపోయాయనే చెడ్డపేరు వస్తుంద’ని ఆయన తన వద్దకు వచ్చిన బిజెపి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో అన్నారు.