జాతీయ వార్తలు

‘వాళ్లనెందుకు రానిచ్చారు?’ జెఎన్‌యు వ్యవహారంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: జవహర్‌లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యకుమార్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు మరోసారి చీవాట్లు పెట్టింది. గత ఫిబ్రవరి 17న కన్హయ్యను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంలో కొందరు వ్యక్తులు నల్ల బ్యాడ్జీలతో కోర్టు హాలులోకి కొందరు వ్యక్తులు ఎలా ప్రవేశించగలిగారని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ ఏ ఎం సప్రేలతో కూడిన ధర్మాసనం పోలీసులను ప్రశ్నించింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ఎందుకు ప్రవేశించనిచ్చారని.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఆరోజు అంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించినట్లయితే పిటిషనర్లు తగిన విచారణ కోరటంలో తప్పేమీ లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.