జాతీయ వార్తలు

రాజ్యసభ గోల..గోల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్దనోట్ల రద్దు, రైతు సమస్యలు, అగస్టా వెస్ట్‌లాండ్ వ్యవహారం గురువారం రాజ్యసభను కుదిపేశాయి. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ అధికార పత్రాలు, నివేదికలను సభకు సమర్పింపజేసి జీరో అవర్ చేపట్టగానే ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ లేచి పెద్దనోట్ల రద్దువల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. అదే సమయంలో అధికార పక్ష సభ్యులు అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణాన్ని ప్రస్తావించడంతో రెండు వైపులనుంచి సభ్యులు తీవ్రంగా విమర్శలు చేసుకున్నారు. అధికార పార్టీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం సరికాదని డిప్యూటీ చైర్మన్ హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దువల్ల రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, సభ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అధికారపక్ష సభ్యులు ఉభయ సభలను అడ్డుకుంటున్నారు అని ఆజాద్ మండిపడ్డారు. రెండు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని కురియన్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆజాద్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రజా సమస్యలు, రైతులకు ఇచ్చిన హామీలను నెర్చవేర్చకుండా అధికారపక్ష సభ్యులే సభను అడ్డుకుంటున్నారని ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్లరద్దు, కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అధికారపక్ష సభ్యులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమైనప్పుడు చైర్మన్ అన్సారీ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. అప్పుడు కూడా సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. దీంతో సభను 2 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనప్పుడు నోట్లరద్దుపై చర్చను కొనసాగింద్దామని సభ్యులకు చైర్మన్ సూచించారు. అధికారపక్ష సభ్యులు అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై నినాదాలు కొనసాగించారు. ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

చిత్రం..రాజ్యసభలో గురువారంనాటి దృశ్యం