జాతీయ వార్తలు

అద్వానీజీ...్థ్యంక్స్: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పార్లమెంటు సమావేశాలు స్తంభించడంపై బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. సొంత పార్టీలోనే ప్రజాస్వామ్య విలువలకోసం అద్వానీ పోరాడుతున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. ‘మీ పార్టీలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేందుకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం అద్వానీజీ’ అంటూ గురువారం ఆయన పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు మిషతో పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజూ సవ్యంగా సాగిన దాఖలాలు లేవు. సభ్యుల గొడవ, గందరగోళం మధ్య కార్యక్రమాలు స్తంభించిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బిజెపి సీనియర్ నేత అద్వానీ పార్లమెంటు సమావేశాల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సభకు తానెందుకు రావాలని అద్వానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనం రేపాయి. పార్లమెంటు సభ్యునిగా విశేష అనుభవం ఉన్న అద్వానీ చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలకు గొడ్డలిపెట్టు వంటిదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధిగా ఉండి సభను నడిపించాల్సిన స్పీకర్ తీరుపైనా అద్వానీ విమర్శలు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అద్వానీ లాంటి సీనియర్ సభ్యుడు పార్లమెంటు కార్యక్రమాలు జరిగే తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.