జాతీయ వార్తలు

పార్టీ అధినేత్రి చిన్నమ్మే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 15: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె అధినేత్రి జె.జయలలిత మృతితో ఆ పార్టీని ముందుకు నడిపించే విషయంలో ఆమె సహచరి వి.కె.శశికళకు పార్టీ మద్దతుగా నిలిచింది. దివంగత నేతకు ఉన్న సుగుణాలు, నాయకత్వ లక్షణాలు శశికళకు ఉన్నాయని, జయలలితకు శశికళ ‘అంతరాత్మ’ వంటివారని, అందువల్ల స్వతస్సిద్ధంగా, ఏకగ్రీవంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికయ్యేందుకు ఆమె అర్హురాలని అధికార ఎఐఎడిఎంకె పేర్కొంది. ఎఐఎడిఎంకె వ్యవస్థాపకుడు, తన మార్గదర్శకుడు ఎంజి రామచంద్రన్‌కు జయలలిత ‘అంతరాత్మ’వంటి వారని, ఆమె వలెనే ఆమెకు చిన్నమ్మ (శశికళ) ‘అంతరాత్మ’వంటి వారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయన్ గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో అన్నారు. ‘అమ్మ కష్టసుఖాలు అనుభవించిన అన్ని సమయాల్లోనూ 33ఏళ్ల పాటు ఆమెతో కలిసి చిన్నమ్మ ఉన్నారు. ఆమె అమ్మకు అంతరాత్మగా కొనసాగుతూ వచ్చారు. ఇకముందు కూడా కొనసాగుతారు. దీర్ఘకాలికంగా పార్టీ చెక్కుచెదరకుండా ఉండటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అందువల్ల చిన్నమ్మ స్వతస్సిద్ధంగా, ఏకగ్రీవంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి, భయానికి తావులేదు’ అని పొన్నయన్ పేర్కొన్నారు. పార్టీ నిర్ణాయక మండళ్లు అయిన జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు శశికళను పార్టీ అధినేత్రిగా ఎన్నుకునే అధికారం ఉందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శశికళను అప్రతిష్టపాల్జేయడానికి, ఎఐఎడిఎంకెను నిర్మూలించడానికి ప్రతిపక్ష పార్టీలు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ ప్రయత్నంలో సఫలం కాబోవని ఆయన అన్నారు.
సిబిఐ విచారణ జరపాలి
న్యూఢిల్లీ: జయలలిత మృతిపై ఉన్న అనుమానాల నివృత్తికి సిబిఐ విచారణ జరపాలని తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

చిత్రం..పొన్నయన్