జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 15: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిదిమంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు దళ కమాండర్లు ఉన్నారు. వీరిపై ఒక్కక్కరిపై రూ.8 లక్షల మేర రివార్డు ఉంది. ఫర్సేగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫుల్‌మడుగు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఎనిమిదిమంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ఇద్దరు జిల్లా కమిటీ సభ్యులు, దళ కమాండర్లు ఉన్నారు. భారీ ఎత్తున ఆయుధాలు, నిత్యావసర వస్తువులు లభించాయి. సంఘటనా ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఫర్సేగఢ్‌కు అదనపు బలగాలు పంపించారు. భద్రతా బలగాలు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని బస్తర్ పోలీసులు పేర్కొన్నారు.