జాతీయ వార్తలు

ధర్మాసనమే తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అంశాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వే టికెట్లు సహా వివిధ అవసరాలకూ రద్దయిన నోట్లను వినియోగించడానికి వీల్లేదంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం జోలికి పోవడం లేదని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదా కాదా అన్న విషయాన్ని నిర్ణయించేందుకు మొత్తం తొమ్మిది అంశాలను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారధ్యంలోని త్రిసభ్య బెంచి తెలిపింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కొన్ని వారాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకు సాధ్యమైనంత త్వరగా కేంద్రం దిద్దుబాటు చర్యలు తీసుకోగలదన్న ఆశాభావాన్ని న్యాయమూర్తులు వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్రం బాధ్యతాయుతంగా, సునిశితంగా వ్యవహరిస్తుందనే ఆశిస్తున్నామన్నారు. రద్దయిన నోట్ల వినియోగ కాలాన్ని పొడిగిస్తారా లేదా అన్నది కూడా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమేనని న్యాయమూర్తులు ఎఎమ్ కన్విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య బెంచి స్పష్టం చేసింది. వారానికి 24వేల రూపాయలను కూడా ఖాతాదారులకు బ్యాంకులు ఇవ్వడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు పరిశీలించారు. దేశ వ్యాప్తంగా నగదు అందుబాటులోకి రావడానికి 50రోజులు గడువు పెట్టామని, అది ఇంకా తీరలేదంటూ అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గీ చేసిన ప్రకటనను న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకున్నారు. రద్దయిన కరెన్సీలో 40శాతం మొత్తాన్ని 2వేలు, 500 నోట్లతో భర్తీ చేశామని కూడా కేంద్రం ప్రకటించిందని పేర్కొన్న న్యాయమూర్తులు ఈ ప్రస్తుత దశలో ఇందుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేమని ఉద్ఘాటించింది. నవంబర్ 11-14 తేదీల మధ్య జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు సేకరించిన 8వేల కోట్ల డిపాజిట్లను కొత్త నోట్లతో మార్పు చేసుకునేందుకు అనుమతిస్తామంటూ అటార్నీ జనరల్ హామీని సుప్రీం కోర్టు అంగీకరించింది.