జాతీయ వార్తలు

ఇదే చివరి చాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16:నల్ల కుబేరులకు కేంద్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. 50శాతం పన్ను, 25శాతం నాలుగేళ్ల పాటు డిపాజిట్ చేయడంతో కూడిన ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పిఎమ్‌జికెవై) పథకం శనివారం నుంచి అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఈ పథకం కింద నల్ల కుబేరులు లెక్కల్లేని తమ ఆదాయాన్ని వెల్లడించాలని, లేని పక్షంలో ప్రాసిక్యూషన్‌తో పాటు కఠిన చర్యలూ తప్పవని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ ఆదియా శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పథకం కింద నల్లధన వివరాలు వెల్లడించే వారికి ఆదాయం పన్ను అధికారుల నుంచి ఎలాంటి వేధింపులూ ఉండవని తెలిపారు. కొత్త పథకం కింద నల్లధన వివరాలు వెల్లడించకుండా దాన్ని టాక్స్ రిటర్న్స్ పేరుతో దీన్ని ఆదాయంగా చూపించే వారు పట్టుబడితే 77.25శాతం పన్ను, పెనాల్టీ వసూలు చేస్తామన్నారు. ఈ పథకాన్ని వినియోగించుకోకుండా, పన్నుల రిటర్న్స్‌లోనూ చూపించని వారిపై అదనంగా మరో పదిశాతం పన్ను వేస్తామని, అనంతరం ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు.
అలాగే అక్రమ సంపాదన కలిగిన వారి వివరాలు వెల్లడించేందుకు సామాన్య ప్రజలు సైతం ముందుకు రావాలన్నారు. ఇలాంటి వారి వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని ఇందుకోసం ప్రత్యేకంగా ఇ మెయిల్ ఐడిని కూడా విడుదల
చేశారు. ఆదాయం పన్ను (రెండో సవరణ)చట్టంలో భాగంగా ఈ పథకాన్ని అమలులోకి తెస్తున్నామన్నారు. ఇటీవలే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ సవరణ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం కూడా లభించడంతో చట్టంగా మారిందన్నారు. కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేసినంత మాత్రాన నల్లధనం తెల్లధనంగా మారిపోదని, దానిపై పన్నులు చెల్లించి తీరాల్సిందేనని చెప్పారు. దీని కింద ముందుగా నల్లధన మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని, ఆ రసీదు చూపించి ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. ఇంతకు ముందు అమలైన పథకంలో ముందుగా నల్లధనం వెల్లడించిన తర్వాత దానిపై పన్నులు కట్టాల్సి వచ్చేదన్నారు. లెక్కల్లేని తమ ఆదాయాన్ని వెల్లడించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఈ మొత్తాన్ని తమ ఆదాయం పన్ను రిటర్న్స్‌లో చూపించాల్సిన అవసరం కూడా ఉందని ఆదియా హామీ ఇచ్చారు.