జాతీయ వార్తలు

అన్నదాతలకు తీపి కబురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఈ వర్షాకాలం అన్నదాతలకు తీపికబురే తీసుకురానుంది. రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం సమృద్ధిగానే వర్షాలు కురుస్తాయని కేంద్రం వెల్లడించింది. దాదాపు రెండేళ్లపాటు మన దేశాన్ని తక్కువ వర్షపాతంతో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ ఏడాది ఉండవని సోమవారం తెలిపింది. ఈ సంవత్సరం వర్షపాతం సంతృప్తికర స్థాయిలో నమోదవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభనా కె పట్నాయక్ సోమవారం తెలిపారు. ‘ఎల్‌నినో ప్రభావం బాగా తగ్గిపోయి లానినా ప్రభావం పెరుతుతోంది. దానివల్ల ఈ ఏడాది వర్షాకాలం ఆశావహంగా సాగుతుంది’ అని పట్నాయక్ వెల్లడించారు. జాతీయ వాతావరణ శాఖ ఈ నెలలో ఇచ్చిన వివరాలు కూడా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయన్నారు. 2014-15లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 252.2 మిలియన్ టన్నులు కాగా గత వ్యవసాయ సంవత్సరంలో 265.04 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. వరి, పప్పు్ధన్యాల దిగుబడుల విషయంలో ఇప్పటినుంచే తగిన ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలని పట్నాయక్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.