జాతీయ వార్తలు

ఢిల్లీలో యువతిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లివిరియడానికి కారణమైన ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటన జరిగి శుక్రవారం నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన రోజే యాదృచ్ఛికంగా ఆ విషాదకర ఘటనను జ్ఞప్తికి తెచ్చే రీతిలో దేశ రాజధానిలో మరో యువతి అత్యాచారానికి గురయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చిన 20 ఏళ్ల యువతి దక్షిణ ఢిల్లీలోని మోతి బాగ్ ప్రాంతంలో అత్యాచారానికి గురయింది. నోయిడాకు చెందిన ఈ యువతి బుధవారం సాయంత్రం ఎయిమ్స్ సమీపంలో బస్సు కోసం వేచిచూస్తుండగా, ‘హోంమంత్రిత్వ శాఖ’ స్టిక్కర్ అంటించి ఉన్న ఒక కారు అక్కడికి వచ్చి ఆగింది. ఆ కారు నడుపుతున్న నిందితుడు అవనీశ్ (28) ఆ యువతిని వెళ్లాల్సిన చోట దింపివేస్తానని చెప్పాడు. దీంతో ఆమె కారు ఎక్కింది. అయితే కారును ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన అవనీశ్ అక్కడ ఆమెపై కారులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఎలాగోలాగ తప్పించుకొని పారిపోయింది. పోలీస్ పెట్రోల్ టీమ్ ఒకటి ఆమెను చూసి గురువారం తెల్లవారు జామున సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా నివాసి అయిన నిందితుడు అవనీశ్‌ను గురువారం అరెస్టు చేశారు. నిందితుడు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఆ కారు యజమాని తండ్రి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్)లో పనిచేస్తున్నాడని డిసిపి (దక్షిణ) ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఆ కారుపై హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ అంటించి ఉండటంపై వారిద్దరిని ప్రశ్నిస్తామని, ఒకవేళ అనుమతి లేకుండా వారు ఆ స్టిక్కర్‌ను అంటించి ఉంటే వారిద్దరిపై చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.
మారింది ప్రభుత్వమే..
మహిళల భద్రత విషయంలో గత నాలుగేళ్లలో ఎలాంటి మార్పు రాలేదని సరిగ్గా నాలుగేళ్ల క్రితం డిసెంబర్ 16న కిరాతకంగా సామూహిక అత్యాచారానికి గురై హతమైన పారా మెడికల్ విద్యార్థి నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో దేశంలో ప్రభుత్వమే మారింది తప్ప మహిళలపై నేరాలు ఏమాత్రం తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని తాము ఈ నాలుగేళ్లలో ఎందరినో ప్రాధేయపడ్డామని, అయినా ప్రయోజనం కలుగలేదని ఆమె పేర్కొన్నారు. నిర్భయను కిరాతకంగా హింసించిన యువకుడు నిరుడు విడుదలయిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసుల గణాంకాల ప్రకారం 2015లో 2,199 రేప్ కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం నవంబర్ 30 నాటికి 1,981 కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని నగరాలలోకన్నా ఢిల్లీలో మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిరుడు ఢిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 17,104 కేసులు నమోదయ్యాయి.