జాతీయ వార్తలు

ఆర్థిక సంపదే అభివృద్ధి మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: వెనుకబాటుతనం, పేదరికాన్ని తరిమికొట్టాలంటే ఆర్థిక సంపదను పెంపొందించడంపై భారత్ దృష్టి పెట్టాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాలను సాధించాలంటే దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమలే కీలకమని, అయితే పారిశ్రామిక రంగం పురోభివృద్ధి అన్నది కార్మిక శక్తి సహా అందుబాటులో ఉన్న వనరులను ఏ స్థాయిలో సద్వినియోగం చేసుకున్నారన్న దానిపైనే ఆధారపడి ఉంటుందని ముఖర్జీ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ ‘మానవత్వం, అధికారం, ఆధ్యాత్మికత’ అనే అంశంపై అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ముఖర్జీ మూలధనాన్ని ఉత్పాదకతను పెంపొందించేందుకు గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరిలోనూ కష్టపడే మనస్తత్వాన్ని పెంపొందించాలని, అలాగే వృత్తిపట్ల నిజాయితీని, నిబద్ధతను ప్రోత్సహించాలన్నారు.

చిత్రం..శుక్రవారం ఢిల్లీలో ‘మానవత్వం, అధికారం, ఆధ్యాత్మికత’
కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్