జాతీయ వార్తలు

అవి విషనాగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎటా (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 16: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), కాంగ్రెస్, కొన్ని చోట్ల అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ (ఆర్‌ఎల్‌డి) కలిసి ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, ఎందుకంటే ఆ పార్టీలు విష నాగులని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇక్కడి యువత చిన్న చిన్న ఉద్యోగాలకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆయన విమర్శించారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న ఈ పార్టీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌పైనా ఆయన విరుచుకుపడ్డారు.
శుక్రవారం ఇక్కడ జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని ‘బాబాయి- అబ్బాయి’ (శివపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్) కాజేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని పేదలు, రైతులకోసం కేంద్రం విడుదల చేసిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా, సమాజ్‌వాదీ పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని అమిత్ షా ఆరోపించారు. అఖిలేశ్ యాదవ్ తన అయిదేళ్ల హయాంలో జరిగిన నేరాలకు, అక్రమాలకు సంబంధించి ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రభుత్వ భూమి ఏళ్ల తరబడి ఆక్రమణకు గురికావడంపై మధుర ప్రజలకు, గ్యాంగ్ రేప్ ఘటనపై, ఆ నేరంపై సమాజ్‌వాదీ పార్టీ నేత, మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై బులంద్‌షహర్ ప్రజలకు, నాటుసారాకు వంద మంది బలికావడంపై ఎటా ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసిందని, అయితే అదంతా బాబాయి-అబ్బాయి జేబుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌ను ఉద్దేశించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువత దేశవ్యాప్తంగా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని, అయితే వారి స్వంత రాష్ట్రంలో సౌకర్యాల కొరత ఉందని ఆయన అన్నారు. గత 15 ఏళ్లుగా అవినీతికి పాల్పడటం ద్వారా ఇక్కడి పాలకులు ఎదిగిపోయారని, మారిపోయారని, కాని, రాష్ట్రం మాత్రం పురోగమించలేదని ఆయన విరుచుకుపడ్డారు.

చిత్రం..పార్టీ ఎంపీలు, నేతలకు అభివాదం చేస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా