జాతీయ వార్తలు

ఆ గుట్టేదో వెంటనే విప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఒత్తిడి పెరుగుతోంది. నరేంద్ర మోదీ అవినీతికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తే భూకంపం వస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించటం తెలిసిందే. నరేంద్ర మోదీ అవినీతికి సంబంధించిన సమాచారాన్ని వెంటనే వెల్లడించాలి లేకపోతే కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి సూచించినట్లు తెలిసింది. వీరితోపాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షం పరువు, ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ వెంటనే నరేంద్ర మోదీ అవినీతికి సంబంధించిన గుట్టును ప్రజల ముందు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శనివారం రాహుల్ గాంధీని ప్రశ్నించారు. మోదీ అవినీతిని పార్లమెంటులో మాత్రమే వెల్లడిస్తానని రాహుల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇతర ప్రతిపక్షాలు ఈ వాదనతో ఏకీభవించటం లేదు. మోదీ అవినీతికి సంబంధించిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాలి లేదా సుప్రీం కోర్టు ముందు పెట్టాలని ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన మంత్రిపై ఆరోపణలు చేస్తే రుజువు చేయవలసి ఉంటుందని ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రైతుల రుణాలు మాఫీ చేయాలంటూ వినతిపత్రం ఇవ్వటాన్ని కూడా ఇతర ప్రతిపక్షాలు నిరసిస్తున్నాయి. రాహుల్ ప్రధానిని కలుసుకోవటం వలన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల మధ్య ఏర్పడిన సమైక్యత ఛిన్నాభిన్నమైపోయిందని స్పష్టం చేశాయి. ఇక మీదట తాము కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని చెబుతున్నాయి. రాహుల్ గాంధీ తన ఇష్టానుసారం రాజకీయం చేస్తే ప్రతిపక్షానికి తీరని నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తానంటే నరేంద్ర మోదీ భయపడిపోతున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన కూడా ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పింది. రాహుల్ గాంధీ ఇలాంటి తలాతోకా లేని ప్రకటనలు చేస్తూపోతే కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షం పరువు, ప్రతిష్ఠ కూడా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.