జాతీయ వార్తలు

కమిషన్ వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాల మూలాలపై దర్యాప్తు జరపడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం డిమాండ్ చేశారు. పాత రూ. 500, 1000 నోట్లను డిపాజిట్ చేసే విషయంలో రాజకీయ పార్టీలను ఆదాయపు పన్ను చెల్లింపు నిబంధన నుంచి ఎందుకు మినహాయించారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం తీసుకున్న ఈ పన్ను మినహాయింపు నిర్ణయానికి శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య జరిగిన భేటీతో సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కేంద్రం ఈ పన్ను మినహాయింపు నిర్ణయాన్ని ప్రకటించిందని ఆరోపించారు. ‘ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలు రూ. 2.5 లక్షలు డిపాజిట్ చేస్తేనే వారిని విచారిస్తారు. అదే రాజకీయ పార్టీలు రూ.2,500 కోట్లు డిపాజిట్ చేసినా ఆ పార్టీలను విచారించరు. ఇది చాలా తప్పు’ అని కేజ్రీవాల్ అన్నారు. అయిదేళ్లుగా రాజకీయ పార్టీల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరపడానికి ఒక స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలకు ఈ విరాళాలు ఎక్కడినుంచి వచ్చాయో కమిషన్ దర్యాప్తు జరపాలన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత అన్ని రాజకీయ పార్టీలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేసిన నగదు వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రూ.20వేల లోపు విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని ఎత్తివేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. పార్టీలకు అందే ప్రతి పైసాను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్‌ను స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌పై కూడా దర్యాప్తు చేయాలని అన్నారు. తాము ప్రతి రశీదును, వోచర్‌ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో బిజెపి భయపడుతోందా? అని నిలదీశారు. ఒకవేళ భయపడకుంటే ఎందుకు దర్యాప్తు జరపడం లేదని ఆయన నిలదీశారు. పెద్దమొత్తంలో నల్లధనం కలిగి ఉన్న రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ సహకరిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.