జాతీయ వార్తలు

తజకిస్తాన్‌తో దృఢమైన బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: తజకిస్తాన్‌తో సహా మధ్య ఆసియా దేశాలతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు భారత పర్యటనకు వచ్చిన తజక్ అధ్యక్షుడు ఎమోమలి రహమాన్‌తో శనివారం మోదీ చర్చలు జరిపారు. ఇరాన్‌తో కలిసి చబహార్ రేవును భారత్ సంయుక్తంగా నిర్మిస్తుందని, ఈ రేవు నిర్మాణం పూర్తయితే ఇక మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య లావాదేవీలు బాగా పుంజుకుంటాయని ఆయన అన్నారు. తజకిస్తాన్, భారత్‌ల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు మోదీ వివరించారు. ఆసియా ప్రాంతంలో అభివృద్ధికి ఆఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొనటం అత్యంత అవసరమని మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉగ్రవాదంపై పోరాటంలో తజకిస్తాన్ చూపిస్తున్న చొరవను మోదీ ప్రశంసించారు. భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని సమర్థిస్తున్నందుకు కూడా మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహమాన్‌తో కలిసి శనివారం
విలేఖరులతో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ