జాతీయ వార్తలు

కరుణ కోలుకుంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతున్న డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం కలిశారు. ఊపిరితిత్తులు, గొంతు ఇన్‌ఫెక్షన్ వల్ల అస్వస్థతకు గురయిన కరుణానిధి ఇక్కడి కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని అనంతరం రాహుల్ గాంధీ విలేఖరులకు చెప్పారు. ‘నేను ఇప్పుడే ఆయనను (కరుణానిధిని) కలిశాను. ఆయన కోలుకుంటుండటం చూసి ఆనందం కలిగింది. త్వరలోనే ఆయనను డిశ్చార్జి చేసి, ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెప్పారు’ అని రాహుల్ విలేఖరులకు తెలిపారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు తిరునవుక్కరుసుసహా ఆ పార్టీ సీనియర్ నాయకులు, డిఎంకె కోశాధికారి ఎంకె స్టాలిన్ రాహుల్‌తో పాటు ఉన్నారు. ‘కరుణానిధి తమిళ ప్రజల నాయకుడు. తమిళనాడు నాయకుడు. అందుకే ఇక్కడికి వచ్చి అతడిని వ్యక్తిగతంగా కలిసి త్వరగా కోలుకోవాలనే నా ఆకాంక్షను వ్యక్తం చేయాలని అనుకున్నాను’ అని రాహుల్ విలేఖరులకు చెప్పారు. కరుణానిధిని పరామర్శించిన వెంటనే రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు.
డిఎంకె జనరల్ కౌన్సిల్ భేటీ వాయిదా
డిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. 20న ఈ సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ పార్టీ అధినేత కరుణానిధితో పాటు ప్రధాన కార్యదర్శి అన్బజగన్ కూడా అనారోగ్యంతో ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని పేర్కొంది. 20న జరిగే సమావేశంలో కరుణానిధి తనయుడు, పార్టీ కోశాధికారి ఎంకె స్టాలిన్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి (వర్కింగ్ ప్రెసిడెంట్)గా పదోన్నతి కల్పిస్తారని వార్తలు వచ్చాయి. చికిత్స పొందుతున్న కరుణానిధిని చూడటానికి ఆసుపత్రికి రావద్దని కూడా పార్టీ ఆ ప్రకటనలో శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. అధినేత అనారోగ్య కారణాల రీత్యా సహకరించాలని కోరింది.

చిత్రం..చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి వెలుపలకు వస్తున్న రాహుల్. చిత్రంలో కరుణానిధి కుమారుడు స్టాలిన్ తదితర డిఎంకె పార్టీ నేతలు