జాతీయ వార్తలు

ఇది మోడీ మేడ్ డిజాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల రద్దును మోదీ సృష్టించిన విపత్తు (మోడీ మేడ్ డిజాస్టర్)గా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ‘మనం ఇంగ్లీషులో ‘మ్యాన్ మేడ్ డిజాస్టర్’ అని ఎలా అంటామో అలా పెద్ద నోట్ల రద్దు మోడీ మేడ్ డిజాస్టర్’ అని రాహుల్ గాంధీ శనివారం గోవాలోని బెల్గాంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, గత రెండేళ్ల కాలంలో దేశ జనాభాలో ఒక శాతం మంది దేశ సంపదలో 60 శాతాన్ని కూడబెట్టిందని శుక్రవారం రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు కూడా అదే ధోరణిలో మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వాన్ని దేశంలో సంపన్నులైన ఒక శాతం ప్రజల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతుందని అన్నారు. ‘ఒక శాతం ‘సూపర్ రిచ్’ కోసం నడుస్తున్న కేంద్రంలోని ‘సూట్-బూట్’ ప్రభుత్వం గద్దె దిగేలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది’ అని రాహుల్ అన్నారు.

చిత్రం..గోవాలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో రాహుల్