జాతీయ వార్తలు

గుండెలను పిండేసే విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఏప్రిల్ 11: ఎక్కడ చూసినా శవాలు.. పోస్ట్‌మార్టమ్ పూర్తయి పక్కనపెట్టిన మృతదేహాలను గుర్తించి తీసుకువెళ్లటానికి వచ్చిన బంధువుల రోదనలు.. పక్కన ఉన్న వార్డులకు వెళ్తే ప్రతి మంచంపైనా క్షతగాక్షత్రులే.. ఒకటి కాదు.. రెండు కాదు.. తిరువనంతపురంలోని వేర్వేరు ఆసుపత్రుల్లో సోమవారం కనిపించిన దృశ్యాలివి. వివిధ ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఆరుగురు మహిళలుసహా 66మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఆదివారం నాటి ఘటనలో ఇంకా గుర్తించని ఆరు మృతదేహాలను ఎంసీ మార్చురీలో భద్రపరిచారు. వీటికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి గుర్తిస్తారు. మృతుల సంఖ్య 109కి చేరింది. బాణసంచా పేలుడుతోపాటు, కాంక్రీట్ స్లాబ్ కూలిపోవటం వల్లనే ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు
పుట్టింగల్ దేవాలయంలో పేలుడు పదార్థాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఉల్లంఘించటం వల్లే ఇంత పెను ప్రమాదం సంభవించిందని పేలుడు పదార్థాల లైసెన్సింగ్, స్టోరేజి పర్యవేక్షణ శాఖ ముఖ్య నియంత్రణాధికారి సుదర్శన్ కమాల్ తెలిపారు. సోమవారం ఆలయ పరిసరాలను సందర్శించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పేలిపోయిన బాణసంచాలో నిషేధిత రసాయనాలను వినియోగించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. కనీసం ప్రాథమికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదని అన్నారు.
పుట్టింగల్ ఆలయ ఉత్సవాల్లో బాణసంచాను నిషేధించాలన్న డిమాండ్‌ను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తిరస్కరించింది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1225 దేవాలయాలను పర్యవేక్షించే తమ బోర్డు ఆలయాల ఉత్సవాల్లో బాణసంచాను పూర్తిగా నిషేధించటం సాధ్యలయ్యేపనే కాదని, ఎందుకంటే అది దేవాలయ ఆచారాల్లో భాగమని బోర్డు స్పష్టం చేసింది.
109మంది మరణానికి కారణమైన పుట్టింగల్ ఆలయ అగ్నిప్రమాదం దుర్ఘటనకు సంబంధించి కేరళ పోలీసులు ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఫైర్‌వర్క్స్ కాంట్రాక్టర్లు, దేవాలయ నిర్వహణ కమిటీ సభ్యులు నిందితుల్లో ఉన్నారు. 307, 308 ఐపీసీ సెక్షన్లు, పేలుడు పదార్థాల నియంత్రణ చట్టంలోని 4వ సెక్షన్ కింద అభియోగాలు మోపారు.

చిత్రం భారీ అగ్ని ప్రమాదంతో కళావిహీనమైన పుట్టంగల్ ఆలయ ప్రాంగణం.