జాతీయ వార్తలు

రీసోర్స్‌శాట్- 2ఎ ఉపగ్రహ సేవలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, డిసెంబరు 17: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఈ నెల 7న పిఎస్‌ఎల్‌వి-సి 36 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపిన రీసోర్స్‌శాట్- 2ఎ ఉపగ్రహం సేవలు అప్పుడే ప్రారంభించింది. భూ వాతావరణ పరిశీలనకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ ఉపగ్రహంలో అధునాతన కెమేరాను అమర్చి పంపారు. ఆ కెమేరా ద్వారా భూ వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వడోదర,,మన్‌జల్‌పూర్, డామన్, దేవా అటవీప్రాంతం, టింబి నది తదితర ప్రాంతాలను పలు చిత్రాలను తీసి పంపింది. రీసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలు ఆయా రాడార్ కేంద్రాలకు సంకేతాలు అందాయి. శనివారం ఉపగ్రహం తీసిని చిత్రాలను ఇస్రో అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రాల్లో ఎక్కడెక్కడ వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు ఉన్నాయి, వ్యవసాయానికి అనుకూల ప్రాంతాలు ఏవి,పట్టణ ప్రణాళిక ప్రాంతాలతో పాటు వ్యవసాయ రక్షణ రంగాలకు అనుకూలమైన ప్రాంతాల చిత్రాలను విజయవంతంగా తీసి పంపింది. ఈ ఉపగ్రహ సేవలు ఐదేళ్లపాటు పాటు అందనున్నాయి.

రీసోర్స్‌శాట్-2ఎ ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలు