జాతీయ వార్తలు

పాక్‌ను ఒంటరి చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 18: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని బంగ్లాదేశ్ హామీ ఇచ్చింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌ను ఒంటరి చేయవలసిన అవసరం ఉందని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ అన్నారు. భారత్‌తో తీస్తా జలాల పంపిణీ ఒప్పందంలో జరుగుతున్న జాప్యం బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలకు, జమాత్ ఇన్ వంటి ఛాందసవాద సంస్థలకు భారత వ్యతిరేక ప్రచారం చేయడానికి అవకాశం ఇస్తోందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాకిస్తాన్ ఎల్లవేళలా ఉగ్రవాదులకు అడ్డాగా, మద్దతుదారుగా ఉంటోంది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారిని నిరుత్సాహపరచాలని, ఒంటరిని చేయాలని మేము భావిస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాద దాడులను నిరుత్సాహపరచడానికి, ఖండించడానికి మనం ప్రతి ఒక్క చర్య తీసుకోవాలి. ఏ దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి ఉగ్రవాద దాడులు చేయకూడదు’ అని కమల్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే సీమాంతర ఉగ్రవాదంవల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశాలలో ఒకటయిన భారత్ బాధను, యాతనను ఆయన పంచుకున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరు చేస్తున్న భారత్‌కు బంగ్లాదేశ్ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. భారత్, బంగ్లాదేశ్- రెండు దేశాల్లో జరుగుతున్న ఉగ్రవాద దాడుల మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘్భరత్, బంగ్లాదేశ్‌లు ఉగ్రవాదం విషయంలో ఒకే వైఖరిని కలిగి ఉన్నాయి. వివిధ ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాన్ పాత్ర ఇటీవలి కాలంలో బహిర్గతం కావడాన్ని మనం చూశాం. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేయాలి’ అని ఆయన అన్నారు.
ఉరీలో ఉగ్రవాదులు దాడికి తెగబడి 18 మంది జవాన్లను బలిగొన్న తరువాత పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనకూడదని భారత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాద దాడులు తీవ్రం కావడంతో సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడం లేదని భారత్ ప్రకటించింది. దీంతో నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సమావేశంలో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ ప్రకటించాయి. పరోక్షంగా పాకిస్తాన్‌పై విమర్శలు గుప్పించాయి. ఇదిలా ఉండగా, భారత్‌తో తీస్తా జలాల పంపిణీ ఒప్పందం భవిష్యత్తులో కుదురుతుందన్న ఆశాభావాన్ని కమల్ వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఈ ఒక్క ఒప్పందంపైనే ఆధారపడకూడదని ఆయన పేర్కొన్నారు.