జాతీయ వార్తలు

పసిపాపకు జయలలిత పేరుపెట్టిన శశికళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 18: తమిళనాడులో ద్రవిడ పార్టీల వీరానిమానులు తమ పిల్లలకు నాయకుల పేర్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి నాయకుల అపాయింట్‌మెంట్‌కోసం కొందరయితే నెలల తరబడి వేచి ఉంటారు కూడా. థేని జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ సెంథిల్ కుమార్, అతని భార్య గాయత్రి కూడా కొత్తగా పుట్టిన తమ పాపకు పేరు పెట్టడంకోసం ఆదివారంనాడు జయలలిత నివాసమైన పోయెన్ గార్డెన్‌కు వెళ్లారు. జయలలిత అనుంగు నెచ్చెలి శశికళ చేత పేరు పెట్టించడానికి వెల్లిన సెంథిల్ కుమార్ దంపతులకు ఊహించని బహుమతి లభించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ పసిగుడ్డును చేతుల్లోకి తీసుకున్న శశికళ ఆ వెంటనే ఆ పాపకు జయలలిత అని పేరు పెట్టారు. తమ కూతురికి అమ్మ పేరు పెట్టడం తాము చేసుకున్న అదృష్టమంటూ వారు పొంగిపోయారు.