జాతీయ వార్తలు

ఎక్కడ చూసినా కొత్త నోట్ల కట్టలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం దేశవ్యాప్తంగా నల్లకుబేరులపై ఆదాయం పన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కట్టల కొద్దీ కొత్త 2 వేల రూపాయల నోట్లు బైటపడుతున్నాయి. ఈ కొత్త నోట్లు వాళ్లకు ఎలా వచ్చాయనే విషయం కూపీ లాగడం ప్రారంభిస్తే కొంతమంది బ్యాంకు అధికారులు కమిషన్ల కోసం క్కుర్తి పడి వారితో కుమ్మక్కయినట్లు కూడా బైటపడుతోంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఫైనాన్స్ వ్యాపారి వద్ద స్వాధీనం చేసుకున్న 1.05 కోట్ల విలువైన కొత్త నోట్లు, హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో ఇటీవల స్వాధీనం చేసుకున్న 90 లక్షల విలువైన కొత్త నోట్ల కట్టలు కూడా వీటిలో ఉన్నాయి. చెన్నైలో టిటిడి బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసాల్లో, బెంగళూరులో దొరికిన కోట్ల కొద్దీ నగదు, బంగారం సంగతి తెలిసిందే. పంజాబ్‌లో ముగ్గురు డ్రగ్ స్మ్లర్లనుంచి పోలీసులు 12 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లు స్వాధీనం చేసుకోగా, నోయిడాలో శనివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌కు బృందం ఒకటి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ 18 లక్షోల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకుంది. సూరత్‌లోని ఓ ఫైనాన్స్ వ్యాపారి నివాసం, కార్యాలయాలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు రెండు మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరేపోయే విధంగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. కోటీ 4 లక్షల విలువైన కొత్త నోట్లతో పాటుగా రూ.1.59 కోట్ల విలువైన
బంగారం, మరో 4.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 1.39 కోట్ల విలువైన ఇతర ఆభరణాలు, కోటీ 28 లక్షల విలువైన వెండి వస్తువులు పట్టుబడ్డాయి. ఇవే కాకుండా వందల కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా కనుగొన్నారు. ఫైనాన్స్ వ్యాపారికి చెందిన లాకర్లను ఇంకా తెరవాల్సి ఉందని ఐటి అధికారులు చెప్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌నుంచి, ట్యాంక్‌బండ్‌పై వేగంగా వెళ్తున్న కారులోంచి దాదాపు 94 లక్షల విలువైన కొత్త 2 వేల రూపాయల నోట్ల ను పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని ఐటి అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దువ్వాడ జంక్షన్ సమీపంలోని పాలనూరులో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి 18.7 లక్షల రూపాయల విలువైన నగదును స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
నగదులో అధిక భాగం కొత్త 2 వేల రూపాయలు నోట్లు కాగా, మిగతావి వంద నోట్లున్నాయి. అలాగే ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఇద్దరిని అరెస్టు చేసి వారివద్దనుంచి 17 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దుల్లోని పల్లియా పట్టణంలో ఇద్దరు కస్టమ్స్ అదికారులనుంచి పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీని పట్టుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ముగ్గు రు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేసి వారివద్దనుంచి 600 గ్రాము ల హెరాయిన్, 12లక్షల విలువైన 2వేల రూపాయల నోట్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు బైటపడిన కేసు లు ఇవి కాగా, ఇకపై మరెన్ని కోట్లు బైటపడతాయో వేచి చూడాల్సి ఉంది.