జాతీయ వార్తలు

పేలుళ్ల వరుస క్రమం ఇదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిబ్రవరి 21, 2013: దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగిన ఘటనలో 18 మంది మృతి చెందగా 130 మంది గాయపడ్డారు.
ఫిబ్రవరి 22: మలక్‌పేట, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదు. అక్రమ ఆయుధాల చట్టం, అసాంఘిక కార్యకలాపాల చట్టం ప్రకారం ఐపిసి సెక్షన్ కింద కేసులు
మార్చి 14: కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి బదలాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం
ఆగస్టు 29: ఇండో-నేపాల్ సరిహద్దులో యాసిన్, అబ్దుల్లాలను ఎన్‌ఐఎ పట్టుకోగా వారు దిల్‌సుఖ్‌నగర్ వద్ద జరిగిన పేలుళ్లకు తామే పాల్పడినట్టు అంగీకరించారు.
మార్చి 14, 2014: ఎన్‌ఐఎ (హైదరాబాద్ శాఖ) దర్యాప్తు పూర్తి. యాసిన్, అబ్దుల్లాలపై మూడు చార్జిషీట్‌లు దాఖలు.
మార్చి 22: రాజస్తాన్‌లో తహసీన్ అక్తర్, వక్వాస్ అరెస్ట్.
మే 6: జ్యుడిషియల్ కస్టడికి అక్తర్, వక్వాస్ రిమాండ్
సెప్టెంబర్ 15: రియాజ్, వక్వాస్, తహసీన్ ముగ్గురిపై చార్జిషీట్ దాఖలు.
నవంబర్ 18: రియాజ్ మినహా మిగతా నిందితులు నాంపల్లి కోర్టులో హాజరు.
ఏప్రిల్ 2015: ఎన్‌ఐఎ కోరిక మేరకు ఎల్‌బి నగర్‌లో స్పెషల్ ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు.
జూన్ 6: చార్జిషీట్‌లో 6వ ముద్దాయిగా అజీజ్‌ను చేర్చిన పోలీసులు
జూలై 6: కోర్టులో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా తనకు ప్రాణహాని ఉందని యాసిన్ కోర్టు ఆవరణలో ఆందోళన
ఆగస్టు 24: రియాజ్ మినహా మిగతా వారిపై చర్లపల్లి జైలులోనే విచారణ ప్రారంభం
అక్టోబర్ 18, 2016: వీడియో సాయంతో నిందితుల తుది విచారణ
నవంబర్ 21: తుది తీర్పు డిసెంబర్ 13కు వాయిదా
డిసెంబర్ 13: ఆరుగురిలో ఐదుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు
డిసెంబర్ 19: ఐదుగురు దోషులకు కోర్టు ఉరి శిక్ష విధింపు.