జాతీయ వార్తలు

భత్కల్ దొరికాకే కేసులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 19: ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ దొరకడంతోనే దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో పురోగతి సాధించినట్టయిందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2013 ఫిబ్రవరిలో పేలుళ్లకు కుట్ర పన్నిన భత్కల్ ఇండో-నేపాల్ సరిహద్దులో 2013 ఆగస్టులో పట్టుబడ్డాడు. భత్కల్‌ను చర్లపల్లి జైలులోని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచగా, అతను ఎలాగైనా తప్పించుకుని వస్తానని భార్యకు ఫోన్‌లో తెలిపినట్టు సమాచారం. దీంతో యాసిన్‌ను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచటంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలావుండగా ఈ కేసులో నిందితులకు ఎన్‌ఐఎ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేయడంతో బాధిత కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జంట పేలుళ్లు సంభవించిన ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పేలుళ్లు జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా మర్చిపోలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుళ్లలో గాయపడ్డ అనేక మంది అంగవైకల్యంతో జీవన పోరాటం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల్లో ప్రభుత్వం కొందరికే పరిహారం చెల్లించిందని, చాలా మందికి పరిహారం అందలేదని, ప్రభుత్వం తగిన సహాయం అందించడంలో జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో స్థానికులు మిఠాయిలను పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

చిత్రం..పేలుళ్లు జరిగిన స్థలంలో బందోబస్తును పరిశీలిస్తున్న సరూర్‌నగర్ సిఐ లింగయ్య