జాతీయ వార్తలు

ఆ సమయంలో ఏం జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: ఆ రోజు 21 ఫిబ్రవరి, 2013 దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో సాయంత్రం వేళ.. షాపులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. హఠాత్తుగా భారీ శబ్దం వచ్చింది. జనమంతా కంగారుతో పరుగులు పెట్టారు. మరికొద్ది సేపటికే మరో భారీ శబ్ధం.. తొక్కిసలాట జరిగింది. రక్తపు మడుగులో అనేకమంది ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆ షాక్ నుంచి తేరుకునే లోగా మృతదేహాలు చిందరవందరగా పడివున్నాయి. తీవ్రగాయాలతో అరుపులు, కేకలు పరిసర ప్రాంతాల వాసులను చలింపజేశాయి. సమయం సరిగ్గా సాయంత్రం గం. 6:58 నిముషాలకు బస్టాప్‌లో మొదటి బాంబు పేలింది. రెండో బాంబు ఏ1 మిర్చి సెంటర్ వద్ద పేలింది. పేలుళ్ల ధాటికి 200 మీటర్ల పరిధిలోని జనంలో 18 మంది మృతి చెందగా, 138 మంది గాయపడ్డారు. ఈ జంట పేలుళ్లు విషాదాన్ని నింపాయి. నగరవాసులకు చేదు అనుభవం మిగిల్చిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లపై ఎన్‌ఐఏ విచారణ జరిపింది. యాసిన్ భత్కల్‌తోపాటు అసదుల్లా అక్తర్, జియాఉల్ రహమాన్, తహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, వకాస్‌లను ఎన్‌ఐఏ కోర్టు దోషులుగా నిర్ధారించింది. మూడున్నరేళ్లపాటు సాగిన విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన తహసీన్ అక్తర్, జియాఉర్ రహ్మాన్, అసదుల్లా అక్తర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటూ హిందూ జనాభా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారు. మలక్‌పేట, బేగంబజార్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను టార్గెట్ చేశారు. పేలుళ్లకు దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి పేలుడు పదార్థాలను తీసుకుని ఓ ఆటోలో బయలుదేరారు. 5కిలోమీటర్ల దూరం నుంచి బ్లాస్ట్ చేసే పేలుడు సామగ్రితో రెక్కి నిర్వహించారు. ఐఈడి, డిటోనేటర్లు అమర్చిన ఓ సైకిల్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో వదిలి 200 మీటర్ల దూరం నుంచి బ్లాస్ట్ చేసి పారిపోయారు.
దేశంలోనే తొలి కేసుగా రికార్డు..
దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సిఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఉసాబాగా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)గా మారి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, వారణాసిలలో పేలుళ్లకు కుట్ర పన్ని 2007 నవంబర్ 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్‌లలో విధ్వంసం సృష్టించింది. తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్‌గా వెలుగులోకి వచ్చింది.
2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోనమి జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. ఆ తరువాత దేశవ్యాప్తంగా విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలోనే ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్‌లో పేలుళ్లతోపాటు అన్ని కేసులు పలు కోర్టుల్లో విచారణ దశలోనే ఉన్నాయి. ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు రికార్డుకెక్కాయి.