జాతీయ వార్తలు

ఐదుగురూ ఐదుగురే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 19: సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు ఉగ్రవాదులూ కరడుగట్టిన నేరస్థులు. 18 మంది దుర్మరణానికి, 138 మంది క్షతగాత్రులు కావడానికి కారణమైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు కర్నాటక, ఒకరు పాకిస్తాన్, ఒకరు పుణె, మరొకరు ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్, ఇంకొకరు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవారు. ఉగ్రవాదమే ఈ ఐదుగురినీ కలిపింది. పేలుళ్లకు పాల్పడిన వారిలో హైదరాబాద్‌కు చెందినవారు ఒక్కరూ లేకపోవడం విశేషం.
యాసిన్ భత్కల్ (34)
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ సోదరుడు యాసిన్ భత్కల్. రియాజ్, యాసిన్ ఇద్దరూ కర్నాటకలోని మంగళూరు సమీపంలోని భత్కల్ గ్రామానికి చెందిన వారు. యాసిన్ దుబాయ్‌లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. దుబాయ్ నుంచి అదృశ్యమైన యాసిన్ కుటుంబంతో సంబంధాలు తెంపుకున్నాడు. పాకిస్తాన్-్భరత్ సరిహద్దుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్ధ శిక్షణ శిబిరంలో ఆయుధ శిక్షణ పొందాడు. ఆ తర్వాత భారత్‌కు నేపాల్ ద్వారా వచ్చి ఇండియన్ ముజాహిదీన్‌లో చేరాడు. మూడుసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో స్వయంగా పాల్గొన్నాడు. అనంతరం అక్కడినుంచి తప్పించుకుని నేపాల్ ద్వారా పాకిస్తాన్‌కు చేరుకోవాలని ప్రయత్నించాడు. 2013 ఆగస్టులో నేపాల్ పోలీసులు యాసిన్‌ను అరెస్టు చేసి భారత్‌కు అప్పగించారు.
ఎజాజ్ షేక్ (29)
మహారాష్టల్రోని పుణెకు చెందిన ఈ ఉగ్రవాది ఇండియన్ ముజాహిదీన్‌లో చేరకముందు బిపివో కంపెనీలో పనిచేసేవాడు. పరారీలో ఉన్న ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది మొహిసిన్ చౌధురికి బావమరిది. దేశంలో ఐఎం కార్యకలాపాల వ్యాప్తికి పథక రచన చేశాడు. ఆయుధాలు సమకూర్చడం, ఏ ప్రదేశంలో బాంబులు అమర్చాలి, మారణకాండకు ఎక్కడ పాల్పడాలనే విషయాల్లో సహాయ సహకారాలు అందించేవాడని అభియోగం. నకిలీ ఐడి కార్డులు, వోటర్ పాస్‌పోర్టులు తయారు చేయడంలో ఎజాజ్ సిద్ధహస్తుడు.
జియా ఉర్ రెహమాన్ (28)
పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద తండాలో సభ్యుడైన జియా ఉర్ రెహమాన్ 2010లో పాకిస్తాన్‌నుంచి నేపాల్ ద్వారా భారత్‌లోకి చొరబడ్డాడు. అప్పటికే పాకిస్తాన్‌కు చేరుకున్న రియాజ్ భత్కల్ ఇచ్చిన ఆదేశాలతో భారత్‌కు చేరుకుని వివిధ నగరాల్లో పేలుళ్లకు పాల్పడ్డాడు.
అసదుల్లా అక్తర్ (31)
ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌కు చెందిన అసదుల్లా 2008లో ఫార్మసీ డిగ్రీని లక్నోలో పూర్తి చేశాడు. బెంగళూరులోని చిదంబరం స్టేడియం, ఢిల్లీలో జుమామసీదు పేలుళ్లు, 2011లో ముంబాయి వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు.
మహమ్మద్ తహసీన్ అక్తర్ (28)
బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌కు చెందిన అక్తర్ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు పాల్పడే ముందు డిగ్రీ కోర్సు చేసేవాడు. అబ్దుల్లాపూర్ మెట్‌లో ఈ పేలుళ్లకు పాల్పడ్డ సహచరులకు సురక్షితమైన ఇంట్లో తలదాచుకునేందుకు ఏర్పాట్లు చేశాడు.

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు సృష్టించిన విధ్వంసం (ఫైల్ ఫొటో)