జాతీయ వార్తలు

సరిహద్దు పోస్టుల వద్ద మహిళా జవాన్లకు మరిన్ని సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: మహిళా సిబ్బందిని మోహరించిన సరిహద్దు పోస్టుల వద్ద ప్రభుత్వం వౌలిక వసతులను పెంపొందించడంతో పాటు మెరుగైన రవాణా సదుపాయలను కల్పిస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. పారా మిలటరీ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్ 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన న్యూఢిల్లీలోని ఎస్‌ఎస్‌బి శిబిరంలో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ, సరిహద్దుల వద్ద మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా జవాన్లకు ప్రస్తుతం సరైన సదుపాయాలు లేవని, కనుక లింగ వివక్షకు తావులేకుండా వారికి వసతులు కల్పించి పరిస్థితిని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. దేశ రక్షణ కోసం ఎస్‌ఎస్‌బి (సశస్త్ర సీమా బల్)తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం), చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఐటిబిపి (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) తమ బలగాల్లో మహిళా సిబ్బందిని మోహరించాయి. దాదాపు ఏడాది క్రితం ఈ ప్రాంతాల్లో మహిళా జవాన్లను మోహరించిన అనంతరం వారికోసం ఈ బలగాలు తమ సరిహద్దు పోస్టుల వద్ద వౌలిక వసతులను మెరుగుపర్చడం లేదా కొత్త వసతులను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ వీటిని ఇంకా మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయా యూనిట్ల నుంచి వస్తున్న వార్తలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను హోం శాఖ చిత్తశుద్ధితో పరిశీలిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

చిత్రం..కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.