జాతీయ వార్తలు

రక్షణ సహకారం పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: భారత ప్రధాని నరేంద్ర మోదీ, కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షుడు అల్‌మాజ్‌బెక్ శర్‌షెనోవిచ్ అటంబయేవ్ మధ్య మంగళవారం ఇక్కడ జరుగనున్న చర్చలలో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య సంబంధాల బలోపేతం అంశం ప్రధానంగా చోటు చేసుకోనుంది. సీనియర్ మంత్రులుసహా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి భారత పర్యటనకు వచ్చిన అల్‌మాజ్‌బెక్.. మోదీతో జరిపే చర్చలలో ఇరు దేశాల మధ్య ఉపరితల అనుసంధాన ప్రాజెక్టుల అనే్వషణకు కూడా అవకాశం ఉంది. అల్‌మాజ్‌బెక్ దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా భారత పర్యటనకు వచ్చారు. భారత్, కిర్గిజ్‌స్తాన్- రెండు దేశాలు కూడా ఉగ్రవాదం, తీవ్రవాదం ముప్పు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రధాని మోదీ నిరుడు కిర్గిజ్‌స్తాన్‌లో పర్యటించినప్పుడు ఇరు దేశాలు రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడం, వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడానికి సంబంధించి ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంయుక్త సైనిక విన్యాసాలతోపాటు ఎత్తయిన పర్వత ప్రాంతాలలో సైనిక ఆపరేషన్లలో పాల్గొనేటప్పుడు సైనికులపై పడే ప్రభావాన్ని తెలుసుకోవడానికి హై-వౌంటెయిన్ బయోమెడికల్ రీసెర్చ్‌పై ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శి (యూరాసియా) జివి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చర్చల అజెండాలో ఇరు దేశాల మధ్య ఉన్న రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవడం, వాణిజ్య సంబంధాలను మరింత పెంపొందించుకోవడం, ఉపరితల అనుసంధాన ప్రాజెక్టులను అనే్వషించడం వంటి అంశాలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో సభ్యత్వంకోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కిర్గిజ్‌స్తాన్ మద్దతిస్తోంది.