జాతీయ వార్తలు

కిర్గిజ్‌స్తాన్‌తో రక్షణ బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత, కిర్గిజ్ స్తాన్‌ల మధ్య మంగళవారం పలు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల సహకారంతో పాటు మొత్తం ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షుడు అల్మాజ్‌బెక్ ఆటమ్‌బయెవ్‌ల మధ్య మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, తిరుగుబాట్లపై పరస్పర సహకారంతో యుద్ధం చేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. రక్షణ, భద్రత, గనుల తవ్వకం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, ఇంధన రంగాల్లో రెండు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ‘యువతకు సవాలుగా మారిన ఉగ్రవాదం, తిరుగుబాట్లు, తీవ్రవాదం వంటి సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని మేం నిర్ణయించుకున్నాం.
ఇరుదేశాల సమష్టి లాభం కోసం వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చాం’ అని మోదీ అన్నారు. కిర్గిజ్‌స్తాన్‌లో భారత్, కిర్గిజ్‌ల మధ్య సంయుక్త మిలటరీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎతె్తైన పర్వత ప్రాంతాల్లో పహరా కాసే సైనికులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై బయోమెడికల్ రీసర్చ్ చేపట్టినట్లు మోదీ వివరించారు. వ్యవసాయం, టూరిజం, సాంస్కృతిక, బ్రాడ్‌కాస్టింగ్, యువజన వ్యవహారాల్లో పరస్పర సహకారం ఉంగుందన్నారు. ఇద్దరు నేతల చర్చలపై ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

చిత్రాలు..కిర్గిజ్‌స్తాన్ అధ్యక్షుడు అల్మాజ్‌బెక్‌కు మంగళవారం ఢిల్లీలో ఓ పుస్తకాన్ని బహూకరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.