జాతీయ వార్తలు

రైతులకు కేంద్రం ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన నవంబర్ నెలతో పాటుగా, డిసెంబర్ నెలలో చెల్లించాల్సిన పంట రుణాల బకాయిలను చెల్లించడానికి అదనంగా మరో రెండు నెలల గడువు ఇవ్వడంతో పాటుగా సక్రమంగా చెల్లించే రైతులు 3 శాతం అదనపు వడ్డీ రాయితీకి అర్హులని కూడా తెలిపింది. వడ్డీ రాయితీ పథకం కింద ఏడాది గడువు ఉండే 3లక్షల రూపాయల వరకు ఉండే స్వల్ప కాలిక పంట రుణాలు 7 శాతం వడ్డీకే లభిస్తున్నాయి. అయితే సకాలంలో చెల్లించిన వారికి ఈ రుణాలు 4 శాతం వడ్డీకే లభిస్తాయి. రైతులు తమ పంటరుణాల బకాయిలను చెల్లించడానికి మరికాస్త సమయం అవసరమనే విషయాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం 2016 నవంబర్ 1వ తేదీనుంచి డిసెంబర్ 31 మధ్య చెల్లించాల్సిన పంట రుణాలకు అదనంగా మరో 60 రోజులు సమయం ఇస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన తెలిపింది. అంతేకాకుండా ఈ గడువులోగా సకాలంలో బకాయిలను తిరిగి చెల్లించిన వారు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే వారికి ఇచ్చే 3 శాతం వడ్డీ రాయితీకి కూడా అర్హులని ఆ ప్రకటన తెలిపింది.
2016 నవంబర్ 1నుంచి డిసెంబర్ 31 లోగా పంట రుణాలను తిరిగి చెల్లించాల్సిన రైతులు అదనంగా ఇచ్చిన 60 రోజుల గడువులోగా చెల్లించినట్లయితే వారికి కూడా సకాలంలో రుణాలు చెల్లించినందుకు ఇచ్చే 3 శాతం వడ్డీ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్ కుమార్ భుటానీ చెప్పారు. దీనికి సంబందించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.