జాతీయ వార్తలు

2000 నోటు ముద్రణకు ఖర్చు రూ.3.54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 20: దేశంలో కరెన్సీ కొరత నేపథ్యంలో అరుదుగానే అందుబాటులోకి వస్తున్న 500, 2000 రూపాయల నోట్లకు సంబంధించి ముద్రణకు ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తిని కలిగించేదే.
ఈ నోట్ల ముద్రణకు అయ్యే వ్యయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రతి 500 నోటును ముద్రించడానికి రూ.3.09 పైసలు, 2000 నోటు ముద్రించడానికి రూ.3.54 పైసలు ఖర్చవుతోందని తెలిపింది.
ఈ కొత్త నోట్లలో సెక్యూరిటీ పరంగా ఎన్నో కొత్త అంశాలు చేర్చినప్పటికీ ఒక్కో నోటు ముద్రణ పాత రేటుతోనే కొనసాగుతోందని స్పష్టం చేసింది. సమాచార హక్కుల కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.