జాతీయ వార్తలు

దేశహితమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్దోయ్ (యుపి), డిసెంబర్ 20: దేశ అభ్యున్నతి కోసమే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని అదుపుచేయడానికి ఈ చర్య ఎంతగానో దోహదం చేస్తుందని మంగళవారం నాడిక్కడ జరిగిన బిజెపి పరివర్తన్ ర్యాలీలో స్పష్టం చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తమకోసమో, మరికొందరి ప్రయోజనం కోసమో తీసుకోవడం జరగలేదని, అవినీతికి ఏ రకంగానూ అవకాశం ఇవ్వకూడదన్న సదుద్దేశమే ఇందుకు కారణమని రాజ్‌నాథ్ వెల్లడించారు. రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చకు విపక్షాలు అవకాశం ఇవ్వలేదని, అందుకే తాము ప్రజా వేదికలపైనే ఈ అంశాన్ని చర్చిస్తున్నామని వెల్లడించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతైనా సమంజసమైనదని, దీన్ని తప్పుబట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు. నగదు రద్దు తర్వాత ఉగ్రవాదం, నక్సలిజం అదుపులోకి వచ్చాయని, అధికులు, పేదలనే తేడా లేకుండా సమన్యాయ వ్యవస్థ అంకురించిందని, రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. భారత దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు స్వస్తి పలకాలని పాకిస్తాన్‌ను హెచ్చరించిన ఆయన, కేవలం పిరికిపందలు మాత్రమే ఉగ్రవాద బాట పడతారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం విషయంలో మంచి చెడులకు ఆస్కారం లేదని, విధ్వంసకాండే దీని లక్ష్యమని తెలిపారు.