జాతీయ వార్తలు

మోదీకే ప్రజామోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పెద్దనోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్యకు ప్రజలు ఆమోదముద్ర చేశారనడానికి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. చండీగఢ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రజలు బిజెపినే గెలిపించారని షా మంగళవారం ఇక్కడ వ్యాఖ్యానించారు. బిజెపికి ప్రజలు ఇచ్చిన తీర్పును చూసిన తరువాతైనా ప్రతిపక్ష కాంగ్రెస్ కళ్లుతెరవాలని బిజెపి చీఫ్ అన్నారు. దేశ ప్రయోజనాలకోసం ప్రధాని మోదీ తీసుకొస్తున్న సంస్కరణలకు ప్రజామోదం ఉందని, ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఇదే సరైన గుణపాఠం అని ఆయన చెప్పారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి ఇరవై డివిజన్లు గెలుచుకుంది. బిజెపి మిత్రపక్షమైన అకాలీదళ్‌కి ఒకటి, కాంగ్రెస్‌కు నాలుగు డివిజన్లు దక్కాయి. బిజెపి కూటమికి 26 సీట్లలో 21 దక్కాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలన, ప్రధాని నరేంద్రమోదీ తీసుకొస్తున్న సంస్కరణలను ప్రజలు సంపూర్ణ మద్దతు ఉందన్న విషయం తాజా ఫలితాలే నిదర్శనమని బిజెపి అధినేత పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే ప్రతిపక్షం పెద్దనోట్ల రద్దుపై రాద్ధాంత చేస్తోందని అమిత్ షా విమర్శించారు. బిజెపి ప్రధాన కార్యదర్శి సిద్దార్థనాథ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. దేశ ప్రజలు మోదీ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని ఆయన చెప్పారు.

చిత్రం..నగదు రహిత లావాదేవిలపై మంగళవారం ఢిల్లీలో
ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా