జాతీయ వార్తలు

రామమోహనరావుకు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 22: తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.రామమోహన రావుకు తమిళనాడు ప్రభుత్వం గురువారం ఉద్వాసన పలికింది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచే కాకుండా ఇతర బాధ్యతల నుంచి కూడా ఆయన్ని తప్పించింది. కొత్త సిఎస్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను నియమించింది. చీఫ్ సెక్రటరి, భూపరిపాలన శాఖ కమిషనర్‌గా ఉన్న గిరిజా వైద్యనాథన్‌ను చీఫ్ సెక్రటరిగా నియమించినట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాలనా సంస్కరణలకు సంబంధించి విజిలెన్స్ కమిషనర్‌గా కూడా వైద్యనాథన్ పనిచేస్తారని స్పష్టం చేసింది. ఈ పదవులను ఇప్పటి వరకూ రామమోహన రావు నిర్వహించారు. రామమోహన రావు ఇంటిపైనా, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఆదాయం పన్ను విభాగం అధికారులు దాడులు జరిపి 18లక్షల నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తాజా పరిణామం నేపథ్యంలో రామమోహన రావు భవిష్యత్ ఏమిటన్నది స్పష్టం కావడం లేదు.

చిత్రం..గిరిజా వైద్యనాథన్