జాతీయ వార్తలు

వాహనదారులకు తిప్పలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:వాహన రిజిస్ట్రేషన్లకు పార్కింగ్ స్థలాన్ని ముడిపెడుతూ కేంద్రం మరో నిర్ణయాన్ని తెరపైకి తీసుకురాబోతోంది. పార్కింగ్ స్పేస్ ఉన్నట్టుగా సర్ట్ఫికేట్ చూపిస్తే తప్ప వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించే పరిస్థితి ఉండదని అలాగే, టాయ్‌లెట్ల నిర్మాణానికి స్థలాన్ని వదిలిపెడితే తప్ప భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణాలకూ అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. వాహనాల కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఈ నిబంధనలను కచ్చితంగా అమలుచేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. కారు లేదా ఇతర ఏ వాహనం కొన్నా..వాటిని ఉంచేందుకు స్థలం ఉండితీరాలని, ఇందుకు సంబంధించిన సర్ట్ఫికేట్ చూపిస్తే తప్ప వాటి రిజిస్ట్రేషన్లు జరుగవన్నారు. అలాగే టాయ్‌లెట్ లేకుండా భవిష్యత్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం జరుగదని, ఇందుకు సంబంధించి ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో తన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోందని చెప్పారు. రహదారులపై వాహనాల రద్దీని నివారించే ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని వెంకయ్య తెలిపారు.
అలాగే ఈ అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరుగుతున్నామన్నారు. ఇంతకు ముందు ఆయన గూగుల్ టాయ్‌లెట్ లొకేటర్‌ను ప్రారంభించారు. దీని సాయంతో ఢిల్లీ ఎన్‌సిఆర్, ఇండోర్, భోపాల్‌లలో టాయ్‌లెట్ల వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. మొత్తం ఆరు వేలకు పైగా టాయ్‌లెట్ల లభ్యత వివరాలను ఇది అందిస్తోందన్నారు.

చిత్రం..గురువారం ఢిల్లీలో 2017 క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు