జాతీయ వార్తలు

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. పదవీ విరమణకు 18 నెలల ముందే ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన రాజీనామా లేఖలో ఆయన ఎలాంటి కారణాలు చూపలేదని ఎల్‌జి ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. 65 ఏళ్ల జంగ్ మాజీ ఐఎఎస్ అధికారి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2013 జూలైలో జంగ్ నియమితులయ్యారు. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీతో జంగ్‌కు నిత్యం ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలతో నజీబ్ విభేదించారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కేంద్ర ప్రభుత్వానికి రాజీనామా సమర్పించారు. పాలనాపరంగా సహకరించిన ప్రధాన మంత్రికి జంగ్ కృతజ్ఞతలు తెలిపారు’ అని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్టప్రతి పాలన అమలులో ఉన్న సమయంలో ఢిల్లీ పౌరులు అందజేసిన ఆదరాభిమానాలు ఎన్నటికీ మరువలేనని నజీబ్ చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహకారానికి కూడా జంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీమానాపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆప్ అధికారం చేపట్టినప్పటినుంచీ జంగ్‌తో నిత్యం ఘర్షణ వాతావరణమే కొనసాగింది. ఆప్ సర్కార్ నిర్ణయాలను లెఫ్టినెంట్ గవర్నర్ తిరస్కరించేవారు. దీంతో ఆయన కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారారంటూ కేజ్రీవాల్ అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. జంగ్ రాజీనామా తనను ఆశ్చర్యానికి లోనుచేసిందని కేజ్రీవాల్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ నజీబ్‌తో అనేక చేదు తీపి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సమన్వయంతోనే పనిచేశారని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో జంగ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. కాగా జంగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేశారని ఆప్ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ విమర్శించారు.