జాతీయ వార్తలు

అంగన్‌వాడి కార్యకర్తలకు కేంద్రం అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: తెలుగు రాష్ట్రాలకు చెందిన అంగన్‌వాడి కార్యకర్తలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అవార్డులను అందచేసింది. దేశవ్యాప్తంగా మాతా శిశు సంక్షేమంకోసం కృషి చేసిన కార్యకర్తలకు బుధవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో బాపట్లకు చెందిన నాగమణికి 2014-15 ఏడాదికి అవార్డు అందుకోగా, 2015-16 ఏడాదికిగాను అనంతపురం జిల్లా కంబదూరు చెందిన శ్రీదేవి అవార్డును అందుకోన్నారు. ఇక తెలంగాణ నుంచి 2014-15 ఏడాదికిగాను సికింద్రాబాద్‌కు చెందిన శారదకు, అలాగే 2015-16 ఏడాదికి నాగర్ కర్నూల్‌కు చెందిన పార్వతమ్మ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.