జాతీయ వార్తలు

కోల్‌కతా పారిశ్రామికవేత్త పారస్‌మాల్ లోధా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కోల్‌కతాకు చెందిన బడా పారిశ్రామికవేత్త పారస్‌మా లోధాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు గురువారం అరెస్టు చేశారు. చెన్నైకి చెందిన నల్లకుబేరుడు శేఖర్ రెడ్డి, ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది రోహిత్ టాండన్‌కు చెందిన రూ. 25 కోట్ల విలువైన పాతనోట్లను కొత్తనోట్లకు మార్పిడి చేయడంలో సహకరించాడన్న ఆరోపణలపై బుధవారం రాత్రి పొద్దుపోయాక ముంబయిలో అరెస్టు చేసిన లోధాను గురువారం కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనను ఏడు రోజులు ఇడి కస్టడీకి అప్పగించింది. 14 రోజులు లోధా కస్టడీని కోరిన ఇడి అవినీతి నిరోధక చట్టం కింద ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ నేరానికి పాల్పడిన అంతర్జాతీయ వ్యక్తులు, హవాలా ఆపరేటర్ల వివరాలు తెలుసుకోవడానికి లోధాను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరముందని తన పిటిషన్‌లో పేర్కొంది. కేసు కీలక దశలో ఉందని, తదుపరి విచారణ కొనసాగించడానికి లోధా కస్టడీ అవసరమని కూడా ఇడి వాదించింది.
పెద్ద నోట్ల రదుర్ద అనంతరం ఆదాయం పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నగదు, బంగారం, ఇతర ఆస్తులను కనుగొనడం తెలిసిందే. చెన్నైలోని శేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో ఐటి అధికారులు జరిపిన సోదాల్లో వందల కోట్ల విలువైన గనదు, బంగారం, ఇతర ఆస్తులను కనుగొన్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాది రోహిత్ టాండన్ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసి 13.65 కోట్ల రూపాయల నగదును పట్టుకోవడం తెలిసిందే. టాండన్ ఆస్తుల విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉన్నట్లు గుర్తించారు కూడా. ఈ రెండు కేసుల్లోను కొత్త 2 వేల రూపాయల నోట్లు భారీ సంఖ్యలో పట్టుబడ్డాయి.కాగా, శేఖర్‌రెడ్డిని బుధవారం సాయంత్రం సిబిఐ అధికారులు అరెస్టు చేసిన మరుసటిరోజే లోధాను అరెస్టు చేయడం గమనార్హం.