జాతీయ వార్తలు

నిందితుడికి ఆశ్రయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: హత్యకేసులో నిందితుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకు అవసరం లేకున్నా ‘ఆశ్రయం’ కల్పించిన ఇద్దరు వైద్యులను సుప్రీం కోర్టు దోషులుగా తేల్చింది. గుర్గావ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ మనీష్ ప్రభాకర్, ఎండి కెఎస్ సచ్‌దేవ్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇద్దరు వైద్యులను దోషులుగా నిర్ధారించింది. హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బల్బీర్‌ను వైద్యం పేరుతో ఏకంగా 527 రోజులు ఆసుప్రతిలోనే ఉంచుకోవడాన్ని బెంచ్ తప్పుపట్టింది. హర్యానా మాజీ ఎమ్మెల్యే బల్బీర్ ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో అతడిపై ట్రయల్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2013 అక్టోబర్ 24 కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుర్గావ్ డాక్టర్లు మనీష్ ప్రభాకర్, కెఎస్ సచ్‌దేవ్ నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి అవసరం లేకపోయినా 527 రోజులు ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉంచుకున్నారని కోర్టు నిర్ధారించింది. మాజీ ఎమ్మెల్యే బల్బీర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నాడని సీతారామ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇస్తూ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. అయితే నిందితుడు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశాడు. పైగా బల్బీర్ ఆసుపత్రిలో ఉన్నందున కోర్టులో లొంగిపోవడానికి వీలుపడలేదని చెప్పుకుంటూ వచ్చారు. దీనిపై విచారణకు కోర్టు ఆదేశించగా 527 రోజుల నుంచి ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా ఉన్నట్టు వెల్లడైంది. కేసు విచారించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ యుయు లలిత్‌తో కూడిన ధర్మాసనం వైద్యులను దోషులుగా తేల్చింది. వైద్యులు, బల్బీర్ జనవరి 2న హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఆ రోజు ముగ్గురికీ శిక్ష ఖరారు చేస్తారు.