జాతీయ వార్తలు

శేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 23: కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారంతో అరెస్టయిన శేఖర్‌రెడ్డి, అతని అనుచరుడు శ్రీనివాసుల బెయిల్ పిటిషన్‌ను ఈనెల 27కు వాయిదా పడింది. శేఖర్‌రెడ్డి కార్యాలయం, నివాసంపై జరిగిన ఐటి దాడుల్లో 170 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారం దొరిగింది. ఇరువురిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో కొత్త కరెన్సీ ఉంది. గురువారంనాడు శేఖర్‌రెడ్డి ఆడిటర్ ప్రేమ్‌కుమార్, క్వారీ కాంట్రాక్టర్లు రత్నం,రామచంద్రన్‌లను సిబిఐ అరెస్టు చేసింది. పెద్దనోట్ల రద్దుచేస్తున్నట్టు కేంద్ర ప్రకటించిన తరువాత ఐదుగురు నిందితులు పాత కరెన్సీని మార్చేశారు. ఈమేరకు సిబిఐ చార్జిషీట్‌లో పొందుపరిచారు. శేఖర్‌రెడ్డితో పాటు మిగిలిన నలుగురు ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఐపిసిలోని సెక్షన్ 409,420, 120బి కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి. బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ ఈనెల 27కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఫస్ట్‌క్లాస్ సౌకర్యాలు కల్పించాలని నిందితుల చేసుకున్న అభ్యర్థనపై న్యాయమూర్తి స్పందించారు. చట్టానికి లోబడే చర్యలు తీసుకోవాలని జైల్ అధికారులకు న్యాయమూర్తి సూచించారు.
విష్ యూ హ్యాపీ
డిజిటల్ క్రిస్మస్!
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: అంతా డిజిటల్ మయమైపోయింది. ఈసారి క్రిస్మస్ వేడుకలకు డిజిటల్ హంగులు అద్దారు. హైటెక్ వీడియో ప్రాజెక్టు మ్యాపింగ్‌తో క్రిస్మస్ శుభాకాంక్షలకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. క్రిస్మస్‌ట్రీ దగ్గర నుంచి గ్రీటింగ్స్ వరకూ అంతా డిజిటల్ మయం అయింది. నొయిడాలోని గ్రేట్ ఇండియా మాల్ వద్ద ఏకంగా 25 అడుగుల ఎత్తయిన క్రిస్మస్ డిజిటల్ కార్డు ఏర్పాటు చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఎల్‌ఇడి బల్బులు అమర్చారు. అలాగే క్రీస్తు జయంతి, శుభాకాంక్షలు తెలుపుతూ స్క్రీన్లపై స్క్రోలింగ్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. యావత్ దేశమే డిజిటలైజేషన్ వైపుపరుగులు తీస్తున్న నేపథ్యంలో డిజిటల్ క్రిస్మస్ కార్డు ఎందుకు ఏర్పాటు చేయకూడదన్న ఆలోచన వచ్చిందని ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ లిమిటెడ్ రిటైల్ హెడ్ మునీష్ బల్‌దేవ్ చెప్పారు. ఆలోచన రావడమే తరువాత ఆచరణలో పెట్టామని ఆయన వెల్లడించారు. మ్యాపింగ్ టెక్నాలజీ సాయంతో క్రిస్మస్‌ట్రీని గ్రాఫిక్స్‌లో వీక్షించవచ్చు. ఫొటో ఫ్లై బూత్ ద్వారా కస్టమర్లను ఆకర్షించేలా ఎల్‌ఇడి స్క్రీన్‌లతో ఏర్పాటు చేశామన్నారు. బహుషా దేశంలోనే ఈ డిజిటల్ గ్రీటింగ్ కార్డు పెద్దది. క్రిస్మస్ అయిపోయినా...2017 జనవరి 1 వరకూ డిజిటల్ గ్రీటింగ్ కార్డు ఉంటుందని బల్‌దేవ్ తెలిపారు.

తెలుగు సహా 4 భారతీయ
భాషల్లో బిబిసి వరల్డ్ సర్వీస్
వచ్చే ఏడాది మధ్యనుంచి అందుబాటులోకి
ముంబయి, డిసెంబర్ 23: బిబిసి వరల్డ్ సర్వీస్ కొత్తగా 11 భాషల్లో తన సర్వీసులను ప్రారంభించాలని అనుకొంటోంది. వచ్చే ఏడాది మధ్యనుంచి ఈ సర్వీసులు పని చేయడం ప్రారంభిస్తాయి. ఈ 11 భాషల్లో నాలుగు భారతీయ భాషలు మరాఠీ, తెలుగు, గుజరాతీ, పంజాబీ భాషలున్నాయి. ఈ కొత్త భాషల సేవలు డిజిటల్ పరంగా అత్యాధునికమైనవిగా ఉండడమే కాకుండా చెప్పుకోదగిన పరిమాణంలో టీవీ, వీడియో ఔట్‌పుట్‌ను కలిగి ఉంటాయని బిబిసి తెలిపింది. ఈ కొత్త సర్వీసులను ప్రారంభించడం ద్వారా భారత్‌లో 157 కొత్త ఉద్యోగావకాశాలను తెరుస్తున్నామని బిబిసి వరల్డ్ సర్వీస్ ఆసియా పసిఫిక్ ప్రాంతం బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం చీఫ్ ఇందు శేఖర్ సిన్హా తెలిపారు. ఇప్పటివరకు జరిపిన విస్తరణల్లో ఇదే అతిపెద్ద విస్తరణ అని, తమ సెంటెనరీ ప్రాజెక్టు 2022లో ఇది ఒక భాగమని కూడా ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మధ్యనాటికల్లా ఈ సర్వీసులు పని చేయడం ప్రారంభిస్తాయని కూడా ఆయన తెలిపారు. ఈ కొత్త భాషలతో కలుపుకొని బిబిసి వరల్డ్ సర్వీస్ 40 భాషల్లో లభ్యమవుతుంది. బిబిసి శతాబ్ది సంవత్సరమైన 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి చేరువ కావాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా సేవలు ప్రారంభించబోయే భాషల్లో అఫాన్ ఒరోమో, అమ్‌హారిక్, టిగ్రిన్యా, ఇగ్బో, పిడ్జిన్ లాంటి ఆఫ్రికా భాషలతో పాటుగా కొరియన్ భాష కూడా ఉన్నాయి.
మహిళ మెదడులో
కొబ్బరికాయంత కణితి
విజయవంతంగా తొలగించిన
బెంగళూరు వైద్యులు
బెంగళూరు, డిసెంబర్ 23: ఇరాక్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తలలోనుంచి కొబ్బరికాయంత పరిమాణంలో ఉన్న కంతిని ఇక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు విజయవంతంగా తొలగించారు. శస్తచ్రికిత్స చేసి కంతిని తొలగించిన తరువాత కూడా సదరు మహిళ జీవించే అవకాశం చాలా తక్కువ అని ఇరాక్‌లోని వైద్యులు పేర్కొనడంతో పాటు ఆమెను మెదడు శస్తచ్రికిత్స కోసం ఇక్కడి ఫోర్టిస్ హాస్పిటల్‌కు పంపించారు. తరచుగా తలనొప్పితో ప్రారంభమైన నొప్పి క్రమంగా చెవుల వరకు, తరువాత శరీరం కుడివైపు మొత్తంగా వ్యాపించిందని ఫోర్టిస్ ఆసుపత్రి తెలిపింది. రెండు సంవత్సరాల పాటు నొప్పిని భరించిన విజ్దాన్ అనే ఈ మహిళ మనుషుల పేర్లను కూడా జ్ఞాపకం ఉంచుకోలేని స్థితికి చేరింది. మాట అస్పష్టంగా రావడం ప్రారంభం అయింది. చివరికి ఆమె శరీరంలో చలనశీలత తగ్గింది. దీంతో ఆమె తలను ఎంఆర్‌ఐ స్కాన్ చేయగా, ఆమె మెదడుపై ఎడమవైపు పెద్ద కంతి ఉన్నట్టు తేలింది. ఈ కంతి సుమారుగా 8+7+6 సెంటీ మీటర్ల పరిమాణంలో ఉందని ఫోర్టిస్ హాస్పిటల్‌లోని న్యూరోసర్జరీ విభాగం డైరెక్టర్ రాజ్‌కుమార్ దేశ్‌పాండే తెలిపారు. ఈ కంతి వల్ల ఎడమ కంటి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. శస్తచ్రికిత్స చేసి ఆ కంతిని తొలగించడానికి తమకు పది గంటలకు పైగా సమయం పట్టిందని ఆయన తెలిపారు.