జాతీయ వార్తలు

ముందే తప్పుకోవాలనుకున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ లెఫ్టెనెంఠ్గవర్నర్‌గా గురువారం హటాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో పడేసిన నజీబ్ జంగ్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తాను ఇంతకుముందే రాజీనామా చేయాలనుకున్నానని, అయితే ప్రధాని తనను పదవిలో కొనసాగమని చెప్పారని ఈ సందర్భంగా జంగ్ చెప్పారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో సౌత్‌బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) చేరుకున్న జంగ్ కార్యాలయంలో గంట సేపు గడిపారు. కాగా, జంగ్ ప్రధానిని మర్యాదపూర్వకంగానే కలిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గురువారం తన రాజీనామా ప్రకటనలో జంగ్ తనకు సహాయ సహకారాలు అందించిన మోదీకి కృతజ్ఞతలు తెలపడం తెలిసిందే. కాగా, ఈ సందర్భంగా ఓ టీవీ న్యూస్ చానల్‌తో మాట్లాడిన జంగ్ రాజీనామా చేయాల్సిందిగా తనపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఊహాగానాలను ఖండించారు. తన నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని, తాను ఇంతకుముందు సైతం పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నానని చెప్పారు. గత యుపిఏ ప్రభుత్వం తనను లెఫ్టెనెంట్ గవర్నర్‌గా నియమించినందున తాను రాజీనామా చేయాలని అనుకున్నానని, అయితే ప్రధాని కొనసాగమని చెప్పారని జంగ్ తెలిపారు. మూడేళ్ల తర్వాత తనను బాధ్యతలనుంచి విముక్తి చేయమని కోరానని, అయితే కొనసాగాలని ఆయన మళ్లీ తనను కోరారని అన్నారు. మూడున్నరేళ్లు గడిచిన తర్వాత మళ్లీ గత మంగళవారం వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు ప్రధానికి చెప్పానని జంగ్ తెలిపారు. కాగా, తాను పుస్తకం రాయాలని అనుకుంటున్నట్లు జంగ్ చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అల్పాహారం సందర్భంగా జంగ్‌తో దాదాపు గంట సేపు సమావేశమైనారు. ఈ సందర్భంగా తాము పరిపాలనా పరంగా తమ రెండేళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటుగా ఇతర విషయాలను చర్చించినట్లు కేజ్రివాల్ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా జంగ్‌ను కలిశారు. జంగ్ ఎందుకు రాజీనామా చేశారని విలేఖరులు కేజ్రివాల్‌ను అడగ్గా, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు కేజ్రివాల్ చెప్పారు.
శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమై పిఎంఓ నుంచి వస్తున్న జంగ్