జాతీయ వార్తలు

ఎస్పీతో కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి సీట్ల సర్దుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, రాష్ట్రీయ లోకదల్ పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవటంతో రాష్ట్ర రాజకీయం మలుపు తిరిగింది. బిజెపిని ఓడించేందుకు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహా కూటమి ఏర్పడినట్లే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భావ సారూప్యత గల పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేస్తున్నామని మూడు పార్టీల నాయకులు చెబుతున్నారు. మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పితోపాటు బిజెపి అధికారంలోకి రాకుండా చూసేందుకు తాము కూటమిగా ఏర్పడుతున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ములాయం సింగ్ యాదవ్ చొరవతోనే మూడు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత తమను దెబ్బ తీస్తుందనే అనుమానంతో ఉన్న ములాయం సింగ్ మహాకూటమి ఏర్పాటు కోసం చాలాకాలం నుండి కృషి చేస్తున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని గ్రహించినందుకే ఆయన కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డితో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు నాలుగు వందల నాలుగు కాగా ఇందులో తమకు ఎనభై సీట్లతోపాటు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు అజిత్ సింగ్ దాదాపు నలభై సీట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ములాయం సింగ్ మాత్రం కాంగ్రెస్‌కు 70, ఆర్‌ఎల్‌డికి ఇరవై సీట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈప్రతిపాదనకు కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి సూత్రప్రాయంగా ఆమోదం చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్, ఎస్‌పి, ఆర్‌ఎల్‌డిల మధ్య సీట్ల సర్దుబాటు కుదరకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బిజెపి, బిఎస్‌పిల మధ్య ఉండేదని అంటున్నారు. బిజెపి, బిఎస్‌పిలను దెబ్బ తీసేందుకు మహాకూటమి ఏర్పాటు ఎంతో అవసరమని భావించిన ములాయం చేసిన మహాకూటమి ప్రతిపాదనకు కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డిలు ఆమోదం తెలిపాయి. రానున్న, వారం పది రోజుల్లో ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేది ఖరారు చేస్తారని అంటున్నారు. రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొన్ని నెలల క్రితం మొదట ములాయం సింగ్‌తో రెండు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో సుదీర్ఘ మంతనాలు జరపటం తెలిసిందే. మూడు పార్టీల మధ్య పదిహేను నుండి ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనే కొంత వివాదం ఉందనీ, మిగతా వాటి విషయంలో స్పష్టమైన అవగాహన ఉందని ఆంటున్నారు. ఇదిలా ఉంటే మహాకూటమి ఏర్పాటు వలన సమాజ్‌వాది పార్టీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ లాభం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పార్టీ పరమైన యంత్రాంగం పూర్తిగా దెబ్బతిని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు మాత్రమే గెలువకలిగింది. ఈ సారి ఒంటరిగా పోటీ చేస్తే పది, పనె్నండుకు మించి గెలుచుకోలేదని అంచనాలు సూచిస్తున్నారు.