జాతీయ వార్తలు

‘భారత్ మాతాకీ జై’ అంటే మాతృభూమికి ప్రణమిల్లడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: భారత మాతాకీ జై’ అంటే భారత దేశానికి జై కొట్టమేనని, ఈ నినాదాన్ని ఎవ్వరూ వివాదాస్పదం చేయకూడదని కేంద్ర పార్లమెంటరీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. భారత్ మాతాకీ జై అనటంలో మత సంబంధమైన అర్థమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన భవన నిర్మాణరంగ సదస్సులో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, భారత్ మాతాకీ జై అని నినదించటం దేశానికి నమస్కరించడమేనని, ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. జన్మనిచ్చిన తల్లిని గౌరవించినట్లే భారత్ మాతాకీ జై అనటం ద్వారా మాతృ దేశాన్ని గౌరవించుకుంటున్నామన్నారు. వందే మాతరం (మాతా నీకు వందనం) అని నినదించడం ద్వారా మన నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని, భారత్ మాతా కీ జై అనేది మాతృ దేశంతో ముడిపడి ఉన్న అంశమే తప్ప మతపరమైన అంశం కాదని ఆయన వివరించారు. భారత్ మాతా కీ జై అనటం దేశ, ప్రజల అభ్యున్నతికి మనల్ని మనం అంకితం చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు విజయం చేకూరాలని కోరుకోవటమేనని ఆయన చెప్పారు. భారత దేశంలో నివసిస్తున్న వారంతా భారతీయులేనని, కనుక దేశానికి జై కొట్టడంలో వివాదం ఏమిటని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.