జాతీయ వార్తలు

అన్ని అంశాలనూ వెల్లడించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కీలకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాల్లో నోట్ల రద్దు అంశంపై జరిపిన చర్చల వివరాలను వెల్లడించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) తిరస్కరించింది. నవంబర్ 8న రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తరువాత దాని అమలుకు సంబంధించి జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాల్లో చర్చించిన అంశాలతో కూడిన మినిట్స్‌ను బహిర్గతం చేయడానికి ఆర్‌బిఐ తిరస్కరించింది. సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం కింద వెంకటేశ్ నాయక్ అనే ఆర్‌టిఐ కార్యకర్త చేసిన దరఖాస్తును తోసిపుచ్చుతూ ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) కింద ఈ వివరాలను వెల్లడించడం కుదరదని ఆర్‌బిఐ తేల్చిచెప్పింది. ఏ అంశాలను బహిర్గతం చేస్తే దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం వాటిల్లుతుందో అలాంటి అంశాలను ఆర్‌టిఐ చట్టం కింద వెల్లడించకుండా మినహాయింపును సెక్షన్ 8(1)(ఎ) కల్పించిందని పేర్కొంది. దేశ భద్రత, వ్యూహం, శాస్తప్రరిజ్ఞానం, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, విదేశాలకు సంబంధించిన అంశాలు మొదలగు వాటికి ఈ చట్టంలో మినహాయింపులు ఉన్నాయి. అయితే తాను కోరిన వివరాలను ఇవ్వడానికి తిరస్కరిస్తూ ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయంపై తాను అప్పీలు చేస్తానని నాయక్ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ముందు గోప్యతను పాటించటాన్ని అర్థం చేసుకోవచ్చని, అయితే నిర్ణయం అమలు తరువాత కూడా గోప్యతను పాటించడంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు తరువాత సామాన్య ప్రజలు అత్యవసర పనులకోసం నరకయాతన పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నగదు కొరత వల్ల గర్భవతుల ప్రసూతి, మృతుల అంత్యక్రియలు వంటి కార్యక్రమాల నిర్వహణకు కూడా సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.