జాతీయ వార్తలు

వాజపేయికి ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 92వ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వాజపేయి నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా ఆయన కలకాలం ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాతో కలిసి వాజపేయి నివాసానికి వెళ్లిన మోదీ మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను కూడా కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాజపేయి కొన్ని సంవత్సరాలుగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసిన ప్రధాని మోదీ వాజపేయితో తనకున్న ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ అరుదైన ఒక వీడియోను కూడా ట్విట్టర్‌లో ఉంచారు. తాను చిన్న వయసులో పార్టీ కార్యకర్తగా వాజపేయిని కలిసిన వీడియోను ఆయన ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పంచుకున్నారు. అటల్‌జీ నిరాడంబరతకు, ఆత్మీయతకు ఈ వీడియో నిదర్శనమని పేర్కొన్నారు.
‘మన్‌కీ బాత్’లో సైతం మోదీ వాజపేయి పుట్టిన రోజన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వంలో దేశం ఒక అణ్వస్త్ర శక్తిగా కూడా ఎదిగిందని ప్రధాని అంటూ, అటల్‌జీ సేవలను ఈ దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. పార్టీ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడుగా, మంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఏ సమయంలోనైనా సరే వాజపేయి అందరికీ ఆదర్శంగా నిలిచారని మోదీ అంటూ, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నానని, ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

చిత్రం..వాజపేయి నివాసానికి వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా