జాతీయ వార్తలు

డిజిటలే జీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25:నగదు రహిత ఆర్థిక వ్యవస్థకే భారత్ పట్టం కట్టబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కొత్త వ్యవస్థకు ప్రజల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.డిజిటల్ ఉద్యమాన్ని దేశ యువతకు అందించిన సువర్ణావకాశంగా పేర్కొన్న మోదీ కొత్త ఆలోచనలు, టెక్నాలజీలు, సరికొత్త ప్రక్రియలకు ఇది ఊతాన్నిస్తుందని చెప్పారు. జాతి జీవనాన్ని డొల్ల చేసిన అవినీతి, నల్లధనంపై పరిపూర్ణ విజయం సాధించాలంటే ప్రతిఒక్కరూ ఈ కొత్త వ్యవస్థను ఆకళింపు చేసుకుని దానికి అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. నగదురహితం అంటే ఏమిటి, నగదు లేకుండా లావాదేవీలను నిర్వహించడమెలా..దేన్నయినా డబ్బులేకుండా ఎలాకొనగలమన్న ఆసక్తి సర్వత్రా నెలకొందని పేర్కొన్న మోదీ మొబైల్ బ్యాకింగ్, ఇ-చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా వినియోగదారులు, వ్యాపారస్తుల కోసం లక్కీ గ్రహక్ యోజన, డిజి ధన్ వ్యాపార యోజన పథకాలను ప్రారంభించారు. లక్కీ గ్రహక్ యోజన విజేతలుగా ఎంపికైన 15వేల మందికి క్రిస్మస్ కానుకగా వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతి అందిస్తామని, ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు. రానున్న కొన్ని రోజుల్లో లక్షలాది కుటుంబాలకు కోట్లాది రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ బహుమతులు పొందాలంటే మొబైల్ బ్యాంకింగ్, ఇ-బ్యాంకింగ్,రూపే కార్డు ద్వారానే లావాదేవీలు జరపాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో చివరి మన్‌కి బాత్‌లో ఆదివారం జాతినుద్దేశించి మాట్లాడిన మోదీ అవినీతిపై చేపట్టిన పోరాటం ఆగదన్నారు. బినామీ ఆస్తుల గుట్టు రట్టు చేసేందుకు అత్యంత కఠిన రీతిలో చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో పెద్ద నోట్ల రద్దు తొలి అడుగు మాత్రమేనని స్పష్టం చేశారు. నగదు రద్దుకు సంబంధించిన నియమ నిబంధనల్లో అనివార్యంగా కొన్ని మార్పులు చేయాల్సి రావడాన్ని మోదీ సమర్థించుకున్నారు. కొత్త నోట్లు సరైన పరిమాణంలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్న ఆయన నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రయత్నాల్ని దెబ్బతీసే శక్తుల్ని ఎదుర్కోవడం కూడా ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ యుద్ధం చరమాంకానికి చేరాలంటే..ఆశించిన ప్రయోజనాలు చేకూరాలంటే ప్రజలు మరింతగా తనకు మద్దతివ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రజల సహకారంతోనే కొందరి అవినీతి బాగోతాన్ని అడ్డుకోగలిగామని..ఇలాంటి వారికి సంబంధించిన స్పష్టమైన సమాచారం తమకు అందుతోందని చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభలూ సక్రమంగా నడిచి ఉన్నట్టయితే ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగి ఉండేదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు అన్ని రకాల మినహాయింపులు, రాయితీలు అందుతున్నాయన్న అంశాన్ని ప్రస్తావించిన మోదీ ‘ఇలాంటి అపోహలకు అర్థం లేదు. చట్టం ముందు అందరూ సమానమే’నని తెలిపారు.