జాతీయ వార్తలు

శబరిమలలో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, డిసెంబర్ 25: శబరిమలలోని మాలికా పురం ఆలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాటలో 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుం టూరు జిల్లాలకు చెందిన వారితో పాటుగా తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన 24 ఏళ్ల అఖిల్‌కుమార్ గాయపడినట్లు, అయితే అతనికి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. సాయంత్రం 6.40 గంటల సమయంలో దీపారాధన ముగిసిన వెంటనే మాలికాపురం సమీపంలోని దిగువ తిరుమట్టం ఉత్తరం వైపున భారీ సంఖ్యలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఐరన్ రెయిలింగ్ కూలిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. వీరంతా మధ్యాహ్నం 12 గంటలనుంచి దర్శనంకోసం ఎదురు చూస్తున్నారు. తొక్కిసలాటలో చిక్కుకుపోయిన భక్తులను ఆదుకొనేందుకు పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, జాతీయ విపత్తుల సహాయక దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) సభ్యులతో పాటుగా అఖిల భారత అయ్యప్ప సేవా సంఘానికి చెందిన వలంటీర్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి మొదట దగ్గర్లోని సన్నిధానం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొండ దిగువన ఉన్న పంపా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలయిన కొందరిని కొట్టాయం ఆస్పత్రికి తరలించడానికి ఎమర్జెన్సీ రెస్క్యూ వాహనాన్ని రంగంలోకి దించారు. తలకు గాయాలయిన ఎనిమిది మందిని కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు శబరిమలలో నోడల్ అధికారి డాక్టర్ సురేష్ బాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కేరళ డిజిపితో ఫోన్‌లో మాట్లాడి తొక్కిసలాట ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి చెందిన భక్తులకు చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తొక్కిసలాటలో గాయపడిన వారి వివరాలు తెలుసుకోవడానికి అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో ఒక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. 08554-220009/230007 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అయితే గాయపడిన వారి వివరాలు తెలుసుకోవడానికి భాష సమస్యగా ఉంటోందని కేరళ డిజిపి చెప్పారు. పంపా ఆస్పత్రి వైద్య సిబ్బందికి సహాయంగా కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజినుంచి ఒక వైద్య బృందం అక్కడికి చేరుకుంది.

చిత్రం..క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం