జాతీయ వార్తలు

ఏక కాలంలో ఎన్నికల నిర్వహణపై జీవోఎం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరిపించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం గురువారం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనుగోలునూ మంత్రుల బృందం పరిశీలనలోకి తీసుకుంది. ఈ బృందానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వం వహిస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన భారత ఎన్నికలకు అవుతున్న విపరీతమైన ఖర్చును తగ్గించేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదన చేసింది. మంత్రుల బృందం ముందుగా లక్షల సంఖ్యలో అవసరమవుతున్న ఈవీఎంల ఖర్చును తగ్గించటానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తుంది. ఆ తరువాత ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరపడంపై ఆలోచన చేస్తుందని ఉన్నత అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ మంత్రుల బృందంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, పీ ఎం ఓ వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్‌లు సభ్యులుగా ఉన్నారు.
.